Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PRE Diabetes Symptoms: మధుమేహం వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే

PRE Diabetes Symptoms:ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (Diabetes) అనేది మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని అందరికి తెలిసిన విషయమే. రక్తంలో చక్కెర (Sugar)(గ్లూకోజ్) స్థాయి పెరగడం వల్ల డయాబెటిస్ (Diabetes) రావడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ముధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నాయి. డయాబెటిస్‌ను సకాలంలో నియంత్రించకపోతే.. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, (Heart disease, stroke, kidney disease,)అంధత్వం వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా వస్తున్నాయి. డయాబెటిస్ ఒకసారి వ్యాపిస్తే.. జీవితాంతం పీడిస్తూనే ఉంటుంది.. అయితే దీనిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. బ్లడ్ షుగర్ నియంత్రణ కోసం చర్యలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ (Diabetes) ను అదుపులో ఉంచవచ్చు.మధుమేహం ప్రారంభ దశలలో (ప్రీడయాబెటిస్ అని పిలుస్తారు) కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి.. వాటిని గమనించడం చాలా ముఖ్యం.. మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సందర్శించి మీ బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం..

ప్రీడయాబెటిస్ (Diabetes) సంకేతాలివే ఏమిటంటే .. మీరు మునుపటి కంటే ఎక్కువ తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే, ముఖ్యంగా రాత్రిపూట, మీ శరీరం అదనపు గ్లూకోజ్‌ను (gluocse) బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు సంకేతం కావచ్చు. ఇలా తరచూ జరుగుతుంటే వైద్యుడిని సంప్రదించండి మంచిదని డాక్టర్లు తెలుపుతున్నారు.

మీరు పుష్కలంగా నీరు (water) త్రాగినప్పటికీ నిరంతరం దాహం వేస్తుంటే.. మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని మరొక సంకేతం అనే చెప్పాలి.ఇక మీరు తిన్న తర్వాత కూడా మీరు నిరంతరం ఆకలితో అనిపిస్తుంటే.. అది మీ శరీరానికి తగినంత గ్లూకోజ్ అందడం లేదని సంకేతం కావచ్చు.అలాగే మీరు ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తే, మీ శరీరం శక్తి కోసం తగినంత గ్లూకోజ్‌ని ఉపయోగించకపోవడానికి సంకేతం అని కూడా చెప్పవచ్చు.అంతేకాకుండా మీ దృష్టి అస్పష్టంగా లేదా మబ్బుగా మసకబారినట్లు అనిపిస్తే, అది మీ రక్తంలో (blood)చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉందని సంకేతం. ఇలాంటి సమయాలలో త్వరగా డాక్టర్లు ను కలిస్తే మంచిది.