Protective for toddy toppers గీత కార్మికులకు రక్షణ మోకులు
--రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
గీత కార్మికులకు రక్షణ మోకులు
—రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
ప్రజా దీవెన/నకిరేకల్: సమైక్య రాష్ట్రంలో పాలకుల కుట్రపూరిత నిర్లక్ష్యం వల్లే కల్లుగీత వృత్తి ప్రమాదకరంగా మారిందని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ప్రమాదాలు నివారించిందుకు కల్లుగీత కార్మికులకు రక్షణ (protection) మోకులకు రూపకల్పన జరుగుతున్నదని, ప్రయోగాత్మకంగా త్వరలో అందివ్వనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం లోని గౌడ సంఘం భవనంలో జరిగిన కట్టంగూరు, శాలిగౌరారం, నకిరేకల్, కేతేపల్లి మండలాల కల్లుగీత సొసైటీల అధ్యక్షులు, ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై క్షేత్రస్థాయిలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో తాటిచెట్టు పై నుండి ప్రమాదవశాత్తు జారిపడి మరొణించిన నకిరేకల్ పట్టణం నకు చెందిన గీత కార్మికుడు కాసుల శ్రీ రాములు గౌడ్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 25వేల చెక్కును ఆయన భార్య కాసుల ఎల్లమ్మ కు, గాయపడిన కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన తండు జానయ్య గౌడ్ భార్య శ్రీదేవి కి రూ. 15వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు తాటిచెట్టు
మీద నుండి పడుతున్న వారి సంఖ్య ప్రతియేటా సగటున 550 ఉన్నదని, అందులో సుమారు 160 మంది చనిపోతుండగా, 250 మంది శాశ్వత వికలాంగులవుతున్నారని తెలిపారు. గీత కార్మికులు భవిష్యత్ లో ప్రమాధవశాత్తున తాటి చెట్టు ఎక్కుచుండగా ప్రమాదం జరుగకుండా ప్రభుత్వం ద్వారా నివారించేందుకు భద్రతా చర్యలకు రూపకల్పన చేస్తున్నదని వివరించారు. అదేవిధంగా గీత కార్మికుల కు రైతు భీమా లాగా గీత భీమా ను అతి త్వరలో ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని, కల్లు గీత కార్మికుల ఆత్మ గౌరవం పెరిగే విధంగా హైదరాబాద్ నగరం లో నెక్లెస్ రోడ్ నందు నీరా కేఫ్ కోసం రూ. 12 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని, అలాగే గౌడులకు కేటాయించిన 15 శాతం మద్యం దుకాణాలను సొసైటీ లకు అప్పగించే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెప్పారు. నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జానయ్య గౌడ్ ఆధ్యకతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ యూసుఫ్, నకిరేకల్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ శేఖర్ , ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్ ఇరుగు రామకృష్ణ , ఎక్సైజ్ స్టేషన్ LDC బుర్రి కిరణ్ నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్స్ కొండ శ్రీను గౌడ్, చేవుగోని శ్రీను గౌడ్, తాటికల్ సొసైటి అధ్యక్షులు చనగాని రాంబాబు గౌడ్, కట్టంగూరు సొసైటి అధ్యక్షులు కొంపల్లి యాదయ్య గౌడ్, పరడ సొసైటి అధ్యక్షులు కొండ రాములు గౌడ్, కడపర్తి సొసైటి అధ్యక్షులు భూపతి నరేష్ గౌడ్, మంగళపల్లి సొసైటి అధ్యక్షులు కొప్పుల అంజయ్య గౌడ్, మర్రురు సొసైటి అధ్యక్షులు పుట్ట జానయ్య గౌడ్, నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు భూపతి వెంకట్ నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి చనగాని రవి గౌడ్, కోశాధికారి కొండ యాదగిరి గౌడ్, సభ్యులు చెవుగోని వెంకన్న గౌడ్, మధగొని వెంకన్న గౌడ్, కొండ శ్రీను గౌడ్, కొండ వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు