rainy season tips: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోకుండా ఉండేలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
rainy season tips
rainy season tips: ప్రస్తుతం వర్షాకాలం (rainy season) మొదలైంది.. ఇప్పటికే అనేక ప్రాంతాలలో వర్షం భారీగా కురుస్తున్నాయి. ఇక పలుచోట్ల అయితే తుఫాను అంటూ తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ వారు తెలియజేస్తూ ఉన్నారు. తుఫాను (storm) ప్రభావంతో అనేక సమస్యలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో చాలావరకు ఎలక్ట్రానిక్ వస్తువులతో (electronic items) తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. జాగ్రత్తలు (tips) పాటించకపోతే అవి అగ్నికి ఆహుతి అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పిడుగుపాటుతో ట్రాన్స్ఫార్మర్లు, ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉదాహరణకు టీవీ ఏసి ఫ్రిడ్జ్ లాంటివి కాలిపోవడం మనం చూస్తూనే ఉంటాము. ఇక మెరుపులతో కూడిన వర్షం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఎందుకు ఆలస్యం ఆ జాగ్రత్తలు ఏమిటో చూద్దామా మరి..
ముందుగా మనకు వర్షపు సూచనలు కనపడితే.. ఇంటికి ఉండే గ్లాస్ కిటికీలు (glass windows), తలుపులు (doors) అన్ని క్లోజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక అంతేకాకుండా ఆకాశంలో ఉరుములు మెరుస్తూ ఉండే సమయంలో మనం ఇంట్లో ఉండే ఏసీ (ac), టీవీ (tv), ఫ్రిడ్జ్ (fride) లకు ఉండే విద్యుత్ కనెక్షను డిస్కనెక్ట్ (disconnect) చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఎక్కువ ఓల్టేజ్ ఉండే ఎలక్ట్రానిక్స్ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉరుము మెరుపుల సమయంలో సాధ్యమైనంతవరకు టీవీ ఫ్రిడ్జ్ లాంటివి అన్ ప్లగ్ చేయడం మంచిది. ఇక చాలావరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో విద్యుత్ ను డిస్కనెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆ సమయంలో ఫోన్ చార్జింగ్ పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ పెడితే ఫోన్ కాలిపోయే ప్రమాదం కూడా ఉందంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా లాప్టాప్, సిస్టంను చార్జింగ్ కూడా ఆఫ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ అలాంటి సమయంలో లాప్టాప్ లేదా సిస్టమును ఉపయోగిస్తూ ఉంటే షట్ డౌన్ (shut down) చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది..
మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్స్ వస్తువులు అగ్నికి ఆహుతి అవ్వకుండా జాగ్రత్త పడండి.