Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

South Central Railway:తాజాగా దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railway) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సికింద్రాబాద్ – నడికుడి మార్గం ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్ అనే చెప్పాలి. ఈ మార్గంలో నడిచే ముఖ్యమైన రైళ్లకు కొన్ని స్టేషన్లలో హాల్ట్‌ను ఎత్తివేసింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కువ దూరం ప్రయాణించే మూడు కీలక రైళ్ల స్టాప్‌లు (trains stop) ఎత్తివేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక సికింద్రాబాద్ – నడికుడి (Secunderabad – Nadikudi)రైలు మార్గంలో ముఖ్యమైన మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్ట్ ను ఎత్తి వేశారు. రేపటి నుండి విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లు.. మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆగకుండానే వెళ్లి పోనున్నాయి ట్రైన్స్. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే నారాయాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలకు కీలకమైన మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్ ఎత్తివేయడంతో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలపై తీవ్ర ప్రభావం బాగా పడబోతోంది.

వాస్తవానికి ఈ ప్రాంతాల నుంచి నిత్యం తిరుపతి వెళ్లే భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ప్రాంతం నుంచి తిరుపతి వెళ్లాలంటే ఉన్న ఏకైక రైలు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (Narayanadri Express)మాత్రమే. ఇప్పడూ ఈ రైలుకు వరుసగా మూడు కీలక హాల్ట్‌లు ఎత్తివేయడంతో ఈ ప్రాంత ప్రజలంతా ఇటు నల్గొండ గానీ.. అటు గుంటూరు గానీ వెళ్లాల్సిందే. ఇక విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు అయితే ఏకంగా నల్గొండ హాల్ట్‌ ను కూడా ఎత్తివేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌‌లో బయలుదేరితే నేరుగా గుంటూరులోనే ఆగనుంది. అటు చెన్నై మార్గంలో వెళ్లేవారికి కూడా ఇబ్బందులు తప్పవు..! చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ మూడు హాల్టులు ఎత్తివేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌ లో బయలుదేరితే ఇక నేరుగా గుంటూరులోనే ఆగనుంది. అటు చెన్నై మార్గంలో వెళ్లేవారికి కూడా ఇబ్బందులు తప్పవు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ మూడు హాల్టులు ఎత్తివేశారు రైల్వే వారు.

మూడు రైళ్లకు మూడు స్టేషన్లలో(3 stations) హాల్టులను ఎత్తివేయడంపై కొందరు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల రైతులు (farmers)మాత్రం బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా స్టేషన్లలో హాల్టులు ఎత్తివేయడంతో సమయం కలిసి రావడంతోపాటు రైలులో రద్దీ కూడా తగ్గుతుందని నేరుగా వెళ్లే ప్రయాణికులు తెలియచేస్తున్నారు. కానీ ఈ ఆయా ప్రాంతాల ప్రయాణికులు మాత్రం రైల్వేశాఖ నిర్ణయంపై మండిపడుతున్నారు. హాల్ట్ లను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం..