Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sugar: చక్కెర మానేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే

Sugar: మనం నిత్యం చక్కెర (Sugar) వాడకం అనేది సాధారణం అయిపొయింది. అయితే చక్కెర వాడడం మంచిది కాదని ఎంత చెప్పినా.. మనం చీమల్లాగా.. చక్కెర (Sugar) పైన ఎక్కువ ఇష్టం చూపుతూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహారంలో చక్కెర మోతాదు పెరిగే కొద్దీ మన ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరుగుతాయని డాక్టర్లు (docters) హెచ్చరిస్తూనే ఉంటారు. చక్కెర వాడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం ఖాయమంటున్నారు.. అందుకే ఒక రెండు వారాలపాటు చక్కెర (Sugar) మానేసి చూడండి.. మీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకే అర్థమవుతాయి. ఓ పదిహే ను రోజుల పాటు చక్కెరను.. మనం దూరం పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందామా

వాస్తవానికి చక్కెరతో (Sugar) చేసే ఆహార పదార్థాలు నోటికి రుచిగా ఉన్నా దాని వెనుక చాలా ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కేవలం ఒక పదిహేను రోజుల పాటు చక్కెర వాడకాన్ని మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులు మనం చూడవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే మనం కొన్ని రోజుల పాటు చక్కెర (Sugar) లేని ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు.

ఈ క్రమంలో చక్కెర (Sugar) వాడకం మానేయటం వల్ల మనలోని రక్తనాళాల్లో ఉండే కొవ్వు (fat) తరుగుతూ వస్తుండటా. మెదడు మరమ్మతులు చేసుకుంటుంది. చక్కెర వాడకం కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది. మానేయటంతో దృష్టి మెరుగు పడుతుంది. మన శరీరంలో శక్తి స్థాయి కూడా పెరుగుతుంది. అలాగే రక్తనాళాల వాపులు (Inflammation of the blood vessels) కూడా తగ్గుతాయి. అంతే కాకుండా తీపి తినాలనే కోరికలు కూడా బాగా తగ్గిపోతాయి. ఇక చెక్కర వాడకం తగ్గటే మనలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి.. బాగా పెరుగుతాయి. ముఖంలో ఉండే కొవ్వు కరిగి.. మనం మరింత అందంగా ఉంటాము. అలాగే కొన్ని రోజుల పాటు చక్కెర తినడం మానేస్తేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావటం మనం గమనించవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల మీరు ఎక్కువ సమయం పాటు శక్తిని కొల్పోకుండా కూడా ఉంటారు.

అకాగే చక్కెర క్యాన్సర్‌కు దారి తీసే ఒత్తిడి, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను పెంచుతుంది. మీ ఆహారంలో చక్కెర తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇక మనం తీపి కోసం చక్కెరకు బదులుగా తేనె, బార్లీ సైరప్, లేదా స్టీవియా వంటి చక్కెర-రహిత (Sugar-free, such as honey, barley syrup, or stevia)ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మంచిది.