Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

The greatness is to show charity without forgetting the roots మూలాలు మరచి పోకుండా దాతృత్వం చాటుకోవడమే గొప్పతనం

--నాగరిక సమాజానికి విద్యనే గీటురాయ --గురుకులాల ఏర్పాటు అందులో భాగమే - -దానిని గుర్తించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ --జన్మనిచ్చిన ఊరు అభివృద్ధికి దోహదo అభినందనీయo  -పెన్ పహాడ్ మండలం అనాజీపురం జడ్ పి ఉన్నత పాఠశాలలో కళావేదిక  ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి

మూలాలు మరచి పోకుండా దాతృత్వం చాటుకోవడమే గొప్పతనం

–నాగరిక సమాజానికి విద్యనే గీటురాయ

–గురుకులాల ఏర్పాటు అందులో భాగమే –

-దానిని గుర్తించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్

–జన్మనిచ్చిన ఊరు అభివృద్ధికి దోహదo అభినందనీయo 

-పెన్ పహాడ్ మండలం అనాజీపురం జడ్ పి ఉన్నత పాఠశాలలో కళావేదిక  ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి

ప్రజా దీవెన/సూర్యాపేట: నాగరిక సమాజానికి విద్యనే గీటురాయి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీపం చీకటిని పారద్రోలి వెలుగులు అందించిన చందంగానే విద్య మనిషి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వంటి నిచ్చెన మెట్లతో భారతదేశంలో ప్రజలను విద్యకు దూరం చేశారని ఆయన తెలిపారు. సూర్యా పేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం అనాజీపురంలోనీ కందుకూరి లక్ష్మమ్మ-పుల్లారెడ్డి మెమోరియల్ జడ్ పి ఉన్నత పాఠశాలలో దివంగత కందుకూరి లక్ష్మమ్మ-పుల్లారెడ్డి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు కందుకూరి నిర్మల ప్రతాప్ రెడ్డి,మేనల్లుడు మలిగిరెడ్డి సుధా అర్జున్ రెడ్డిలు రూపొందించిన కళావేదికను మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కందుకూరి లక్ష్మమ్మ-పుల్లారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.పాఠశాల హెడ్ మాస్టర్ నంగురి యుగందర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో దాతలు కందుకూరి నిర్మల ప్రతాప్ రెడ్డి,మలిగిరెడ్డి సుధా అర్జున్ రెడ్డి లతో పాటు ఉన్నత విద్యా మండలి మాజీ డైరెక్టర్ ఒంటెద్దు నరసింహా రెడ్డి,సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,ఎస్ యం ఎస్ చైర్మన్ తక్కెళ్లపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి నిరోదకులు ప్రజలను విద్యకు దూరం చేసిన ఫలితమే మనుషుల మధ్యన అంతరాలు పెరిగి దేశం మీదకు శత్రు దేశాలు దండయాత్రలతో దేశాన్ని ఆక్రమించుకుని వందల ఏళ్ళు పాలించారని ఆయన చెప్పుకొచ్చారు. దానిని గుర్తించిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నన్నారు.

విద్యకున్న ప్రాముక్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించిన మీదటనే తెలంగాణా రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి అద్భుతమైన ఫలితాలు రా రాబడుతున్నామన్నారు.2014 కు పూర్వం నాటి పాలకులు కుడా ప్రజలను అభివృద్ధి వైపు దృష్టి సరించ కుండా పల్లెల్లో ఘర్షణలు రెచ్చగొట్టి అలజడులను ప్రేరేపించి ప్రజలకు విద్యను అందుబాటులో లేకుండా చేశారని ఆయన విమర్శించారు.

పల్లెలు ప్రశాంతతో ఫరీడవిల్లినప్పుడే గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయి అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్దం పడుతుందన్నారు.జన్ననిచ్చిన తల్లి తండ్రులను పుట్టిన నేల ములాలు మరచి పోకుండా అభివృద్ధి కోసం దాతృత్వం కలిగిన దాతలు ముందుకు రావడం అభినంద నీయమన్నారు.

ఇక్కడి పాఠశాల కు ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు వారి వారి పూర్వీకుల జ్ఞాపకార్థం ఈ తరహా అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలు కందుకూరి నిర్మల ప్రతాప్ రెడ్డి,మలిగిరెడ్డి సుధా అర్జున్ రెడ్డి లను ఆయన అభినందించారు.