Urinary Infection :ప్రస్తుత రోజులలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ( Urinary Infection) అనేది మహిళల్లో సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది . ఇది సాధారణ బాక్టీరియా (Bacteria)సంక్రమణం. 50 నుంచి 60 శాతం మంది మహిళలు ఈ తరహా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే మూత్ర మార్గము అంటు వ్యాధులు ప్రాణాంతకం కానప్పటికీ, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు అనేక విధాలుగా సమస్యాత్మకంగా ఉంటాయి. తరచుగా మూత్ర విసర్జన (urination) చేయాలనే కోరిక. మూత్ర విసర్జన చేసేటప్పుడు కడుపులో మంట మరియు నొప్పి ఉంటుంది. ఈ సమస్య చికిత్సలో భాగంగా, డాక్టర్ యాంటీబయాటిక్స్ సూచిస్తారు. యాంటీబయాటిక్స్ అనేది సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే మందులు. ఈ కోర్సు 5 రోజులు ఉంటుంది. అయితే సమస్య మరీ పెద్దది కాకపోతే కొన్ని పద్ధతులను ఉపయోగించి ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (Urinary tract infection) నుంచి బయట పడాలి అంటే ఇవి పాటించాలి .. అవి ఏమిటంటే .. ముందుగా నీరు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో సహా అన్ని ఆరోగ్య సమస్యలకు నీరు ఒక ముఖ్యమైన పరిష్కారం. తగినంత ద్రవం తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ల (Urinary tract infection) ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. తరచుగా త్రాగే నీరు మూత్రాన్ని పలుచన చేస్తుంది. ఇది మీకు ఎక్కువ మూత్ర విసర్జన చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మన శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగడం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు బెస్ట్ హోం రెమెడీ (home remide).
అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర గింజలను ఒక గ్లాసు (glass water)నీటిలో వేసి మరిగించి తాగాలి. ఈ డ్రింక్ ను రోజుకు మూడు నాలుగు సార్లు తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి 1 గంట నాననివ్వాలి. మీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ త్వరగా నయం కావడానికి ఈ నీటిని ఫిల్టర్ చేసి త్రాగండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంటే రోజుకు ఒకసారి కొబ్బరి నీళ్లు తాగితే ఇన్‌ఫెక్షన్ (infection) నుంచి త్వరగా బయటపడవచ్చు.