Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Walnuts: నానబెట్టిన వాల్‌నట్స్‌తో బెనిఫిట్స్ ఇవే

Walnuts:సాధారణంగా డ్రై ఫ్రూట్స్ (dry fruits) ఆరోగ్యానికి చాల మేలు కలిగిస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసారం లేదు. ముఖ్యంగా బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని డాక్టర్లు తెలుపుతూనే ఉంటారు. అయితే కేవలం నానబెట్టిన (soaked)బాదంతో మాత్రమే కాదని, నానబెట్టిన వాల్‌నట్‌తో కూడా చాలా లాభాలు ఉన్నాయి అని మీకు తెలుసా.? అవును ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. అవీ ఏమిటంటే..

సహజంగా వాల్‌నట్స్‌లో (Walnuts) ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని బాగా సహాయ పడుతుంది. వాల్‌నట్స్‌లో లభించే ఆరోగ్యకరమైన కొవ్వు.. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో సహాయ పడుతుంది.అలాగే వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ (Antioxidants) పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా వాల్ నట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడతాయి, తద్వారా సెల్ డ్యామేజ్‌ను నివారించి, ఇన్ఫ్లమేషన్‌ను కూడా తగ్గుతుంది.

ఇక వాల్‌నట్స్‌లో ఎక్కువ క్యాలరీలు (Calories)ఉండడంతో వీటిని తినగానే శరీరానికి ఇన్‌స్టాంట్‌ శక్తి (ఇన్‌స్టాంట్‌ శక్తి)వస్తుంది. కనుక రోజు ఉదయాన్నే తినడం వల్ల మీ రోజువారీ పని చేయడానికి తగినంత శక్తి కూడా వస్తుంది. ఇక వాల్‌నట్స్‌ ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇవి జీర్ణక్రియతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ కారణంగా, పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది, తరచుగా ఆకలిగా అనిపించదు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగ కుండా సహాయ పడుతుంది. వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ పుష్కలంగా లభిస్థుంది. అందుకే చర్మానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఇ ముడతలు, చర్మం కుంగిపోవడం వంటి అనేక వృద్ధాప్య సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు.. ఈ వాల్ నట్స్ ను ఉపయోగించడం మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే చాలా మేలు కలుగుతుంది.