Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A locked house is targeted: తాళం వేసిన ఇల్లు లక్ష్యంగా…

-- ఆటకట్టించిన నల్లగొండ పోలీసులు -- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ -- దోచుకున్న సొత్తును స్వాధీనం -- వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ అపూర్వరావు

తాళం వేసిన ఇల్లు లక్ష్యంగా…

— ఆటకట్టించిన నల్లగొండ పోలీసులు
— అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
— దోచుకున్న సొత్తును స్వాధీనం
— వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ అపూర్వరావు

ప్రజా దీవెన /నల్లగొండ: అర్థరాత్రి సమయంలో తాళము వేసి ఉన్న నివాసాలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ర్ట నిందితులను ( Two interstate suspects involved in thefts) నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 20 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి ఆభరణాలు,ఒక ల్యాబ్ టాప్, రెండు సెల్ ఫోన్స్, మూడు ఇనప రాడ్లు మొత్తంగా సుమారు రూ. 14 లక్షల 20వేలవిలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ( About Nalgonda district SP K. Apoorva Rao said that property worth RS 14 lakh 20 thousand was seized) వెల్లడించారు.

తమిళనాడు రాష్ట్రం కు చెందిన K. ఇమ్రాన్ ఖాన్ ( 37), నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాస్తవ్యుడైన E.సూర్య (38) సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ చెన్నై లో నివాసముంటున్నారు. వీరిద్దరు కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

ఇదిలా వుండగా ఎన్జీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముషంపల్లి రోడ్డులోని న్యూ సాయి నగర్ లో నివాసముంటున్నారు. కుటుంబ సబ్యులతో పాటు తన కూతురు ను వరంగల్ NIT లో చేర్పిoచుటకు వెళ్ళిన సమయములో ( At the time he went to enroll his daughter in Warangal NIT along with family members) గుర్తు తెలియని దొంగలు తలుపు తాళము పగులతొట్టి లోనికి వెళ్ళి బెడ్ రూమ్ బీరువాలో ఉన్న 6 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్ టాప్ నగదు రూ. 5 వేలు దొంగిలించారు.

కాగా నల్లగొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డు లో అనుమానాస్పదముగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అపి విచారించగా సరైన సమాదానాలు రాకపోవడంతో ( When two people were stopped and questioned, they did not get proper answers) ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా నల్లగొండ సాయి నగర్, చౌటుప్పల్, అబ్దుల్లాపూర్ మెట్, నార్కట్ పల్లి,నకరేకల్, నల్లగొండ లలో మొత్తం 21 దొంగతనాలకు పాల్పడ్డారని ఇద్దరి పంచుల సమక్షం లో ఒప్పుకున్నారని వివారించారు.

2020 సంవత్సరం కరోనా సమయంలో ఉపాధి దొరకక తనకు పరిచయమైన ఇమ్రాన్ ఖాన్ తో కలిసి దొంగతనాలు ( Thefts along with Imran Khan, whom he met when he could not find employment during Corona) చేయుటకు నిర్ణయించుకొని చెన్నై లో దొంగతనాలు చేస్తే దొరుకుతామని సూర్యకు పరిచయం ఉన్న ప్రదేశం చౌటుప్పల్, అబ్దుల్లాపూర్మేట్ , నార్కెట్పల్లి, నకరేకల్, నల్గొండ లలో తాళము వేసి ఉన్న ఇండ్లను ఎంచుకొని రాత్రి పూట తాళములు పగులగొట్టి దొంగతనములు చేసేందుకు నిర్ణయించుకున్నారు.

వీరి పేరు మీద మొత్తం 20 కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ కేసును నల్లగొండ డి.యస్.పి శ్రీధర్ రెడ్డి ఆద్వర్యంలో సి‌సియస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నల్గొండ 1 టౌన్ సిఐ సత్యనారాయణ ( CCS Inspector Jitender Reddy, Nalgonda 1 Town CI Satyanarayana on behalf of Nalgonda DSP Sridhar Reddy investigated the case) సి‌సియస్ హెడ్ కానిస్టేబుల్స్ జి.విష్ణువర్ధన గిరి, లింగారెడ్డి, పుష్పగిరి, కానిస్టేబుల్స్ ఇమ్రాన్, నరేశ్ లను జిల్లా ఎస్పీ అపూర్వ రావు అభినందించినారు.