A missed danger for Minister KTR : మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
-- ఆర్మూర్ నామినేషన్ కార్యక్రమంలో ఘటన
మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
— ఆర్మూర్ నామినేషన్ కార్యక్రమంలో ఘటన
ప్రజా దీవెన/ఆర్మూర్: ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ కు పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఈ అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. నామినేషన్ ర్యాలీలో ప్రచార రథం పైనుంచి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , ఎంపీ సురేష్ రెడ్డిలు కింద పడిపోయారు.
ప్రచార రథం డ్రైవర్ ఊహించని విధంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగిపోయి అందరూ పైనుంచి కింది పడిపోతున్న క్రమంలో కేటీఆర్ ను భద్రత సిబ్బంది వెనకనుంచి పట్టుకొని కాపాడగా, జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డిలు ఏకంగా కింద పడిపోయారు.
ఇది ఇలా ఉండగా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డ కేటీఆర్ తనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఆర్మూర్ నామినేషన్ కార్యక్రమం అనంతరం కొడంగల్ రోడ్ షో బయలుదేరి వెళ్లానని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.