Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A new disease beyond the covid pandemic: కోవిడ్ మహమ్మారిని మించిన కొత్త వ్యాధి

-- ప్రపంచంలో కొత్త ప్రాణాంతక వ్యాధి గుర్తింపు --వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో శాస్త్రవేత్తలు -- ఆందోళనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం

కోవిడ్ మహమ్మారిని మించిన కొత్త వ్యాధి

— ప్రపంచంలో కొత్త ప్రాణాంతక వ్యాధి గుర్తింపు
–వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో శాస్త్రవేత్తలు
— ఆందోళనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం

ప్రజా దీవెన/ డబ్ల్యూహెచో: ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద వ్యాధి గురించి హెచ్చరిక జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కొత్త వ్యాధి కారణంగా కోట్లాది మంది మంది చనిపోవచ్చన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త వ్యాధి కోవిడ్ మహమ్మారి కంటే 20 రెట్లు పెద్దదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు.

ఎంతో ప్రాణాంతకంమైన ఈ వ్యాధిని నివారించడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు 25 లక్షల మంది మరణించారని గుర్తు చేశారు. ఈ కొత్త వ్యాధి అంతకంటే ప్రాణాంతకం అని దీని కారణంగా సుమారు ఒకటికి పదిరెట్ల కోట్ల మంది చనిపోతారని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కొత్త వ్యాధికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ స్పానిష్ ఫ్లూ వంటి వినాశనానికి ఇది కారణమవుతుందనే భయం ఉందని చెప్పారు. 1918-1920లో, స్పానిష్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారని, ప్రపంచ యుద్ధం కంటే మహమ్మారి మరణాలు ఎక్కువ ఇలాంటి మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటుందని UK వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చైర్‌ కేట్ బింగ్‌హామ్ అన్నారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో స్పానిష్ ఫ్లూ కారణంగా మరణించిన వారి సంఖ్య రెట్టింపని, గతంలో కంటే నేడు వైరస్‌లు ఎక్కువగా ఉన్నాయని, వాటి రకాలు కూడా చాలా త్వరగా సోకుతాయన్నారు. అన్ని రకాలు ప్రాణాంతకం కానప్పటికీ అవి అంటువ్యాధులకు కారణమవుతాయని, దాదాపు 25 వైరస్ కుటుంబాలను గుర్తించామని శాస్త్రవేత్తలు త్వరలో వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నారని తెలిపారు.

కొత్త వ్యాధి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ అంటువ్యాధులకు కారణమవుతాయని చెప్పారు . ఇందులో కొత్త వ్యాధి Xతో పాటు ఎబోలా వైరస్, మార్బర్గ్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, కోవిడ్-19, జికా, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మొదలైనవి ఉన్నాయని, వీటిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి విపరీతమైనదిగా పరిగణించ బడుతుందని, కరోనాకు ముందు కూడా ఈ వ్యాధి విపరీతంగా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పారు.