A trauma to Gaza: గాజాకు గాయం
-- సంక్షోభం ముంగిట పాలస్తీనా -- ఆ ప్రాంతం వదిలివెళ్ళాలని ఇజ్రాయెల్ హుకుం -- పది లక్షల మంది భవితవ్యo ప్రశ్నార్థకం -- గాజులోకి ప్రవేశించనున్న ఇజ్రాయెల్ దళాలు
గాజాకు గాయం
— సంక్షోభం ముంగిట పాలస్తీనా
— ఆ ప్రాంతం వదిలివెళ్ళాలని ఇజ్రాయెల్ హుకుం
— పది లక్షల మంది భవితవ్యo ప్రశ్నార్థకం
— గాజులోకి ప్రవేశించనున్న ఇజ్రాయెల్ దళాలు
ప్రజా దీవెన/ గాజా: పాలస్తీనా గాజాకు కోలుకోలేని పెద్ద గాయమైంది. ఇజ్రాయెల్, హమాన్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణ ఆరో రోజుకు చేరుకోగా ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 2800 మంది (The armed conflict between Israel and Haman terrorists has reached its sixth day and so far 2800 people have been killed in these attacks) చనిపోయారు. మరోవైపు గాజా పంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి దాదాపు పది లక్షల మంది సురక్షిత తరలిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
హమాస్ దళాలను అణచివేస్తామని, ప్రతి ఒక్క హమాస్ తీవ్రవాదిని అంతమొదిస్తామని (We will crush Hamas forces and eliminate every single Hamas terrorist) ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రకటన చేసిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు వెలువడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. హమాస్ తీవ్రవాదులు దాదాపు 150 మంది పౌరులను పట్టుకోగా వారిని విడుదల చేసేంత వరకూ తమ దిగ్బంధాన్ని విరమించేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తున్నది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటన చేస్తూ ఉత్తర గాజాలో ఉంటున్న దాదాపు 11 లక్షల మంది పౌరులు వెంటనే ఖాళీ ( Almost 11 million civilians living in northern Gaza were immediately evacuated) చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇది అసాధ్యమైన ఆదేశమని, వినాశకర పరిణామాలు తప్పవని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డ్యూజర్రిక్ అన్నారు.
గాజా స్ట్రిప్పై దాడిని సమర్థించుకునే కోణంలో ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుoడగా ( Israel tries to justify the attack on the Gaza Strip) పౌరులు, చిన్నపిల్లల శవాల గుట్టల ఫొటోలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నాటో రక్షణ మంత్రులకు పంపింది. వీరంతా హమాస్ దాడుల్లో చనిపోయినవారేనని పేర్కొoది.
గాజాలోకి చొరబడేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతం తీవ్ర మానవతా సంక్షోభం ఎదుట నిలిచింది (The region is facing a severe humanitarian crisis) . ఇప్పటికే ఇక్కడ చనిపోయిన వారి సంఖ్య 1500 దాటింది. ఇతర మార్గాల్లో యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నదని ఇరాక్లో ని ఐరాస మిషన్ హెచ్చరించింది.
హమాస్ దాడుల్లో తమ జోక్యం ఏమీ లేదని ఇరాన్ చెబుతున్నది. గురువారం నాటి లెక్కల ప్రకారం గాజా స్థిపై పై ప్రతి 30 క్షణాలకు ఒక బాంబు దాడి జరుగుతు న్నదని (According to calculations, there is a bomb attack on Gaza every 30 seconds) ఏఎస్పీ వార్తా సంస్థ తెలిపింది. శనివారం నుంచి దాదాపు నాలుగు వేల టన్నుల బరువున్న పేలుడు పదార్థాలతో కూడిన ఆరువేల బాంబులను గాజాస్త్రిపై పై ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
హమాస్ ఆధీనంలో ఉన్న గజాస్ట్రిప్లో చొరబడేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాల్లో ఉన్నదన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా పదకొండు లక్షల మందిని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసినట్టు ( It seems that warnings have been issued to evacuate eleven lakh people) ఐరాసకు వెల్లడింది. అయితే విధ్వంసకర పర్యవసానాలకు దారి తీసే ఈ ఆదేశాలను సత్వరమే ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఐరాస కోరింది.
అయితే ఇజ్రాయెల్ ముందస్తు హెచ్చరికలపై ఐరాస స్పందన అవమానకరమైనదని (The UN response to Israel’s early warnings was humiliating) ఐరాసలో ఆ దేశ ప్రతినిధి గిలాడ్ ఎర్డాన్ అభివర్ణించారు. తమకు సలహా ఇవ్వడం బదులు హమాస్ చర్యలను ఖండించడం, ఇజ్రాయెల్ స్వరక్షణకు ఉన్న హక్కుకు మద్దతు ఇవ్వడంపై దృష్టిసారించాలని సూచించారు. హమాస్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో గాజా సమీపానికి దాదాపు 3.60 లక్షల రిజర్వ్ సైన్యాన్ని తరలించింది. సమీప ప్రాంతాల్లోని వేలమందిని అక్కడి నుంచి ఖాళీ చేయించింది.