Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aadhaar, PAN card link…or that’s it: ఆధార్, పాన్ కార్డుల లింక్….లేదoటే అంతే

--ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ పని చేయదు --ఇప్పటికే జరిమానాతో కొనసాగుతోన్న లింక్ ప్రక్రియ 

ఆధార్, పాన్ కార్డుల లింక్….లేదoటే అంతే

–ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ పని చేయదు
–ఇప్పటికే జరిమానాతో కొనసాగుతోన్న లింక్ ప్రక్రియ 

ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: ఆధారు కార్డు, పాన్ కార్డు రెండింటికి ముడి పెట్టకపోతే ప్రమాదం ముంచుకోస్తుంది. అదేమనుకుంటున్నారా ఆధార్ కార్డు పాన్ కార్డు రెండింటిని అనుసంధానం చేయకపోతే ( If Aadhaar card and PAN card are not linked) ఇక అంతే సంగతులని ఒకవైపు ప్రభుత్వ వర్గాలు మరోవైపు వాణిజ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో పాన్‌, ఆధార్‌తో లింక్‌ చేయడం నూటికి నూరుపాళ్లు అనివార్యమైంది.

దేశంలో కొనసాగుతున్న మోసాలతో పాటు పన్నులు ఎగ్గొట్టకుండా, ఇతరేతర మోసాలను కట్టడి చేసేందుకు ( To curb tax evasion and other frauds along with ongoing frauds in the country) కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశం లో ప్రతి పనికి ఆధార్‌తో లింక్‌ చేయాలని చాలా కాలంగా స్పష్టం చే స్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయ డం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆధార్‌తో అను సంధానం చేయని పాన్‌కార్డులను డీయాక్టివేట్‌ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్న నేపద్యంలో ఇదే విషయంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు.

 

పార్లమెంటు శీతాకాల సమావేశాల సంద ర్భంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ కార్డులను డియా క్టివేట్ చేస్తున్నారా ( Deactivating PAN cards of those who have not linked PAN with Aadhaar during winter session of Parliament) అని రాజ్యసభలో కూడా ఒక ప్రశ్న సభ్యుడు అడి గిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. జూన్ 30వ తేదీ వరకు 54,67,74,649 పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధా నం చేసినట్లు తెలిపారు.

ఇంత వరకు ఏ పాన్ కార్డును డీయాక్టివేట్ చేయలేదని స్పష్టం చేశా రు. ఒకవేళ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయక పోతే పాన్ కార్డ్ మాత్రం ఎట్టి పరిస్థితులలో పని చేయదు కానీ డీ యాక్టివేట్‌ కాదని ( If PAN is not linked with Aadhaar then under no circumstances will the PAN card be functional but not deactivated) స్పష్టం చేశారు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30వ తేది గడువు గా ఇచ్చిందని, దీని తర్వాత ప్రజలు రూ.1000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్‌లను లింక్ చేస్తున్నారని వెల్లడించారు.

పాన్‌తో ఆధార్‌ ను లింక్ చేయడం చాలా ముఖ్యమని లేకపోతే ఎ వ్వరైనా తమ త మ వ్యక్తిగతమైనా ముఖ్యమైన పనులు చేసుకో లేక పోతారని చెప్పా రు. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు, ట్యాక్స్‌కు సంబం ధించి ఎలాంటి పనులు చేసుకోలేరని ( He cannot do any transaction related to the bank and any work related to tax) తెలిపారు. అంతేకాకుండా పా న్‌ను ఆధార్‌కు లింక్ చేయకుండా లబ్ధిదా రులు ఎవ్వరూ ప్రభుత్వ పథకాలను పొందలేరని మాత్రం చెప్పక తప్పడం లేదని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధానం విషయం లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ప్పటికీ ఇంకా ఎంతోమంది అనుసంధానం విషయంలో వెనుకబడ డం పట్ల మంత్రి అసహనo వ్యక్తం చేశారు.