
ACB lightning strike on Panchayat Secretary : ప్ర జా దీవెన, ఖమ్మం: ఒక చిన్న రేకుల గది నిర్మాణ అనుమతి కోసం ఓ సామాన్యుడిని పీడించిన ప్రభు త్వ అధికారి చివర కు ఏసీబీ (AC B) వలలో చిక్కాడు. లంచం తీసుకుంటూ ఖ మ్మం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం స్థానికంగా తీవ్ర కల కలం రేపింది.ఖమ్మం జిల్లా ముది గొండ మండలం భానాపురం గ్రా మానికి చెందిన ఒక వ్యక్తి, తనకు న్న 5 కుంటల స్థలంలో ఒక చిన్న రేకుల పైక ప్పు గల గదిని నిర్మించు కోవాలనుకున్నాడు. దీనికి సంబం ధించిన భవన నిర్మాణ అనుమ తులు (Building Permis sion), అలాగే ఇంటి నంబర్‌ను కేటాయిం చాల్సిందిగా భా నాపురం గ్రామ పం చాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సు రేష్ ను ఆశ్రయించాడు. అయితే, తన అధికారిక విధులను నిర్వ ర్తించడానికి సదరు కార్యదర్శి ససేమిరా అన్నాడు. ఆ పని కావాలంటే రూ. 25,0 00/- లంచం ఇవ్వా ల్సిందేనని డి మాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు, ఈ విషయాన్ని అవినీతి నిరో ధక శాఖ (ACB) అధికారుల దృ ష్టి కి తీసుకెళ్లాడు.
పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ఖమ్మం రేంజ్ అధికా రులు పక్కా వ్యూహం రచించారు. శనివారం (27.06.2026) ముది గొండ మండలంలోని ‘రైతు వేదిక’ వద్ద బాధితుడి నుండి పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ రూ. 2 5,000/- లంచం డబ్బును స్వీకరి స్తుండగా, ఏసీబీ అధికారులు ఒక్క సారిగా మెరుపు దాడి చేసి అతడి ని రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడి నుంచి రూ. 25,000/- లంచం సొమ్మును అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. తన స్వా ర్థ ప్రయోజనాల కోసం, నిజాయితీ లేకుండా చట్టవిరుద్ధంగా వ్యవహ రించి నందుకు గానూ సురేష్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తు తం నిందితుడిని వరంగల్‌లోని ‘SPE & ACB కేసుల ప్రత్యే క న్యాయ మూర్తి’ ముందు హాజరుపరిచగా కేసు తదుపరి దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదు దా రుడి వివరాలను ఏసీబీ అధికా రులు పూర్తిగా గోప్యంగా ఉంచారు.
అవినీతిపై పోరాడండి.. ఏసీబీని సంప్రదించండి
ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో, ఏ అధికారి అయినా మీ వద్ద లం చం డిమాండ్ చేస్తే భయపడకుం డా ఏసీబీ (ACB)ని ఆశ్రయిం చం డి. బాధితులు/ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉం చబడతాయని ఏసీబీ అధికారులు తెలియజేస్తున్నారు. ఏసీబీని
టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ (WhatsApp): 94404 46106,ఫేస్‌బుక్ (Facebook) Telang ana ACB, X (ట్వి ట్టర్), @Telan gana ACB, ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉం డేందుకు అన్ని ప్రభుత్వ కార్యాల యా లు, ప్రముఖ బహిరంగ ప్రదేశా లలో ACB యొక్క QR కోడ్ లను కూడా ప్రదర్శించారు. అవినీతి ర హిత సమాజం కో సం మీవంతు బాధ్యతగా స్పందించండoటూ అధికారులు వెల్లడిస్తున్నారు.






