Footpath: చిరు వ్యాపారాలు ఫుట్ పాత్ ఆక్రమిస్తే చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
చిరు వ్యాపారులు ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారాలు చేసుకున్నట్లయితే వారిపైచట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు.
ప్రజా దీవెన ,కోదాడ: చిరు వ్యాపారులు ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారాలు చేసుకున్నట్లయితే వారిపైచట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం లో ప్రధాన రహదారి పక్కన చిరు వ్యాపారుల ఫుట్ పాత్ ఆక్రమణ లను క్రమబద్ధీక రించి మాట్లాడారు.ఫుట్ పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిబ్బంది ట్రాఫిక్ ఏఎస్ఐ కొంగల వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ఖయ్యూం, హోంగార్డు శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Actions on vendors encroach on footpath