Advanced buses to RTC: ఆర్టీసీకి అధునాతన బస్సులు
--సరికొత్త 1050 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం --400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు --తొలివిడతగా 80బస్సులను ప్రారంభించిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ఆర్టీసీకి అధునాతన బస్సులు
–సరికొత్త 1050 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం
–400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు
–తొలివిడతగా 80బస్సులను ప్రారంభించిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడిన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందిం చేందుకు టీఎస్‌ఆర్టీసీ రవాణా రంగంలోని మార్పులను అనుగుణం గా ప్రయాణికులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో నే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేసింది.
ఈ ఆర్థిక సంవత్స రానికి గానూ రూ.400 కోట్ల వ్యయంతో అధునా తన మైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణ యించి వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీప ర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులకుతోడు హైదరాబాద్ నగ రంలో 540 పర్యావరణ హిత మైన ఎలక్ట్రిక్ వాహనాలు, తెలంగాణ లో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వాడకంలోకి తీసుకరానుంది.
ఆయితే విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నారు. మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త బస్సులు తీసుకొస్తుండటంతో ప్రయా ణికులకు కొంత ఉపశమనం దొరకనుంది.
బస్సులను ప్రారంభించిన పొన్నం...తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సంస్థ మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. 30 ఎక్స్ప్రెస్ 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్, సీటర్ బస్సు లను శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చే సిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారం భించారు.
కార్మికుల సంక్షేమo, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాల్సి న అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ గుర్తు చేశారు. ఆర్ టిసి ఉద్యోగులకు సంబంధించిన సిసిఎస్ బకాయిలు త్వరలో విడుదల చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు త్వరలోనే వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు.
సంస్థకు కొత్తగా అందుబాటులోకి రానున్న వెయ్యి బస్సుల్లో హైదరాబాద్ కు 500, జిల్లాలకు 500 బ స్సులు కేటాయించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి రవా ణా, రహదారి భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.