After the final decision of the Supreme Court: సుప్రీంకోర్టు తుదినిర్ణయం తర్వాతే
-- ఎమ్మెల్సీ కవితకు సమన్లన్న ఈడి -- కోర్టు సూచనతో కవితకు ఊరట
సుప్రీంకోర్టు తుదినిర్ణయం తర్వాతే
— ఎమ్మెల్సీ కవితకు సమన్లన్న ఈడి
— కోర్టు సూచనతో కవితకు ఊరట
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఢీల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను (Petition filed by BRS MLC Kavitha on Delhi liquor scam) సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. మద్యం కుంభకోణంలో తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
కవిత పిటిషన్‌ను జస్టిస్ సoజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి నవంబర్ 20కి వాయిదా (The two-judge bench adjourned to November 20) వేసింది. గత విచారణలో ఈడీ సమన్లను కూడా కవిత తప్పుబడుతూ సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదన్నారు.
ఈడీ దర్యాప్తుపై నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు కవిత పిటిషన్ లను కూడా సుప్రీంకోర్టు విచారించింది. నవంబర్ 20వరకు వాయిది వేసిన సుప్రీంకోర్టు అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని (ED not to issue summons to Kavitha) ఆదేశించింది.
విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని వెల్లడించింది.