Opinionజాతీయంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

AI leader Sudhakar Reddy Warning to Journalists : బిగ్ బ్రేకింగ్, జర్నలిస్టులకు సుధా కర్ రెడ్డి హెచ్చరిక, ఎట్టి పరిస్థితు ల్లో ఏఐ మాయలో పడొద్దు

--డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలి -- ఫ్యాక్ట్‌చెకింగ్ టూల్స్‌తో నిజాని జాలు తేల్చాలి -- ఏఐ సహాయకుడేమానవ విచక్షణకు ప్రత్యామ్నాయం కాదు”

 

AI leader Sudhakar Reddy Warning to Journalists : ప్రజా దీవెన, హైదరాబాద్‌: కళ్ల ముందు కనిపించేదంతా నిజం కాదు.. చెవులతో వినేదంతా వాస్తవం కాదు! ము ఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ఈ కా లంలో ఫొటో, వీడియో, ఆడియో రూపంలో వచ్చే సమా చా రాన్ని నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించా ల్సిం దే. డీప్‌ఫేక్‌లు, వక్రీకరించిన కంటెం ట్‌, తప్పుడు సమాచా రాన్ని అ డ్డుకోవడంలో జర్నలిస్టులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీ నియర్ జర్నలిస్టు, టెక్నాలజీ నిపుణుడు ఉ డుముల సుధాకర్ రెడ్డి సూచించారు.

సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం గూ గుల్‌, డాటా లీడ్స్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన ఏఐ ప్రొవెనె న్స్‌ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐతో రూ పొందించిన లేదా మార్చిన ఫొటోలు, వీడియోలు, ఆడియో లు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి.. వాటి నిజానిజాలను ఎలా నిర్ధారించాలి అనే అంశాలపై జర్నలిస్టులకు అవగాహ న కల్పించారు.

  ఏఐ చెప్పిందని అక్షరాలా నమ్మొద్దు

ఏఐని వృత్తిపరమైన సహాయకుడిగా ఉపయోగించుకోవాలే త ప్ప మానవ విచక్షణకు ప్రత్యా మ్నాయంగా భావించకూ డదని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ ఐ వ్యవస్థలు కొన్ని సార్లు వాస్తవం లేని సమాచారాన్ని సృష్టించే అవ కాశం ఉం దని, దీనినే ‘హాల్యూసినేషన్‌’ అంటారని వివరించారు.ఏఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తీసుకుని వార్తగా ప్ర చురించడం ప్రమాదకరమని హె చ్చరించారు. ముఖ్యమైన ప్రతి సమాచారాన్ని స్వతంత్రంగా ధృవీ కరించాలని సూచిం చారు. అవసరమైనప్పుడు పలు ఏఐ మోడళ్లు, విశ్వసనీ య మానవ వనరు ల ద్వారా సమాచారాన్ని క్రాస్‌చెక్‌ చే యాలని తెలిపారు.

   డీప్‌ఫేక్‌లకు టెక్నాలజీతోనే చెక్!

ఏఐ ఆధారిత నకిలీ కంటెంట్‌ను గుర్తించేందుకు అందుబా టులో ఉన్న సాంకేతిక సాధనాలను జర్నలిస్టులు వినియో గించాలని సూచించారు. గూగుల్‌ అభివృద్ధి చేసిన SynthI D, Backstory వంటి టూల్స్‌ ద్వారా ఏఐ కంటెంట్‌ను పరిశీ లించే విధానాలను వివరించారు.SynthID ద్వారా గూగుల్‌ ఏఐ సిస్టమ్స్‌తో రూపొందిం చిన చిత్రాలు, వీడియోలు, ఆడి యోల్లో ఉండే కనిపించని డిజిటల్‌ వాటర్‌మార్క్‌లను గుర్తిం చే అ వకాశం ఉంటుందని తెలిపారు.అదే సమయంలో ఏఐ కంటెంట్‌ ఏ ప్లాట్‌ఫామ్‌ నుంచైనా రావచ్చని, అందువల్ల అవ సరాన్ని బట్టి HiDetect AI, airma.com, PimEyes వంటి ఇతర సాధనాలను కూడా ఉపయోగించాలని సూచించా రు.

ఒక్కఫొటో చూసి కథనం నమ్మొద్దు

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు తున్న ఫొటో లేదా వీడియో ను చూసి వెంటనే వార్త రాయొద్దని సుధాకర్ రెడ్డి సూచిం చారు. అది నిజంగా చెప్పిన ప్రదేశానికి, సందర్భానికి సంబం ధించినదేనా అనే విషయాన్ని ముందుగా నిర్ధారిం చుకోవా లని అన్నారు.Google Street View, Google Earth Pro వంటి జియోలోకేషన్‌ సాధ నాల ద్వారా ప్రదేశంలోని రహ దారులు, భవనాలు, భౌగోళిక పరిస్థితులు, పాత చిత్రాలను పోల్చి కంటెంట్‌ నిజస్వరూపాన్ని తెలుసుకోవచ్చని వివరిం చారు.అనుమానాస్పద సోషల్‌ మీడి యా ఖాతాలను పరిశీ లించడం ద్వారా బాట్స్‌, ఆటోమేటెడ్‌ అకౌంట్లను గుర్తించ వచ్చని తెలిపారు. ఫొటోల మూలాన్ని తెలుసు కోవడంలో ఫేషియల్‌ సెర్చ్‌ టూల్స్‌ కూడా ఉపయోగపడతాయని చె ప్పారు.

 ప్రాంప్ట్‌’ సరిగ్గా ఇస్తేనే మంచి ఫలితం

ఏఐని సమర్థవంతంగా ఉపయో గించుకోవాలంటే జర్నలిస్టు లు Prompt Engineeringపై అవగాహన పెంచుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు. ఏఐకి స్పష్టమైన పాత్ర, అవసర మైన నేపథ్యం, కావాల్సిన ఫార్మాట్‌ను నిర్దేశిస్తే మెరుగైన ఫ లితాలు పొందవచ్చన్నారు.అయితే ఏఐ తన శిక్షణ డేటా లో ఉన్న పక్షపాతాలు, మూస ధోరణులను కూడా పునరు త్పత్తి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే ఏఐ రూపొందించిన కంటెంట్‌ను ఎలాంటి ధృవీకరణ లేకుండా ప్రచురించకూడదని స్పష్టం చేశారు.

    10 వేల మందికి పైగా శిక్షణ

ఇప్పటివరకు జర్నలిస్టులు, వి ద్యార్థులు సహా10,000 మం దికి పైగా వ్యక్తులకు ఫ్యాక్ట్‌చెకింగ్‌, ఏఐ బాధ్యతాయుత విని యోగంపై శిక్షణ ఇచ్చినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. మీడి యా సంస్థల సంపా దకీయ ప్రమాణాలను కాపాడే తుది బా ధ్యత జర్నలిస్టులదేనని పేర్కొన్నారు. నిరంతర అభ్యా సం, ఫ్యాక్ట్‌చెకింగ్‌ నైపుణ్యాలు, స్వీయ కేస్‌స్టడీల ద్వారా డీప్‌ఫే క్‌లు, తప్పుడు సమాచారం, వక్రీ కరించిన కంటెంట్‌ను సమ ర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం హైద రాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి రమేష్ వరికు ప్పల, ఉపాధ్యక్షులు ఏ. రాజేష్‌, అత్తలూరి అరుణ, సంయు క్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, వనం నాగరాజు, దయ్యా ల అశోక్, తదితర ఎగ్జిక్యూటివ్‌ కమి టీ సభ్యులు సుధాకర్ రెడ్డిని సన్మానించి అభినందించారు.

Related Articles

Back to top button