
Aicc Bakka Judson Pen Down Movement : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ సమాజం ఆశించిన ఆశ యాలు, సబ్బండ వర్గాల హక్కుల సాధన కోసం జూన్ 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మక “పెన్‌డౌన్” ఉద్యమాని కి శ్రీకారం చుడుతున్న ట్లు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కా ర్యదర్శి (సంఘం తరపున) బక్క జడ్సన్ ఒక ప్రకటనలో అ ధికారి కంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు, ఔట్సో ర్సింగ్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, ఆశా వ ర్కర్లు, ని రుద్యోగ యువత మరియు ప్రజా సంఘాలు ఈ మహా సంగ్రామంలో భాగస్వాములు కావాలని ఆయన పి లుపునిచ్చా రు.
ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ కోట్లాది మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో నాడు ఉద్య మించిన వి ద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆవే దన ను నేటి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపిం చా రు. దురదృష్టవశాత్తూ, తెలంగా ణ ఏర్పడిన తర్వాత కొన్ని ఉ ద్యోగ సంఘాలు, మేధావులు ప్రజా సమస్యలను పక్కన బెట్టి ప్రభుత్వానికి వత్తాసు పలకడం శోచనీయమన్నారు. పెండింగ్ డీఏ (DA)లు, పీఆర్‌సీ (PRC) బకాయిలను వెంట నే విడుదల చేయాలి. సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్ర భుత్వ ఉద్యోగాలను త క్షణమే భర్తీ చేయాలి. నిరుద్యోగుల వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 చొ ప్పున నిరుద్యోగ భృతి చెల్లించాల ని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో సేవలు అం దిస్తున్న ఆశావర్కర్ల జీతాలను పెంచాలని అప్పీల్ చేశారు. ప్రభు త్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్ష ణమే భర్తీ చేయాలని కోరారు.
రాష్ట్రంలో దాదాపు 25,400 మం ది రిటైర్డ్ ఉద్యోగుల బకా యిలను ప్రభుత్వం తొక్కిపెట్టింది. కొత్త ని యామకాలు చేప ట్టకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశా లలు తీవ్ర సిబ్బంది కొరతతో కు నారిల్లుతున్నాయి. పాలన పూర్తి గా పడకేసింది.
ప్రభుత్వానికి తుది హెచ్చరిక ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి, తమ న్యాయమైన డిమాం డ్లపై సానుకూలంగా స్పందించాలని జడ్సన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూ న్ 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కా ర్యా లయాలు, విద్యాసంస్థల్లో కలం బంద్ (పెన్‌డౌన్) చేసి నిరస నను ఉధృతం చేస్తామని, దీనివల్ల జరిగే పరిణామాలకు ప్ర భుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.




