Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aicc CMRevanthReddy : ఆర్డీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుంది

ఎస్సారెస్పీ రెండవదశకు రాoరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నాం --తుంగతుర్తి గోదావరిజలాలు ర ప్పించిన ఘనత ఆర్డిఆర్ దే --కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలు పెరుగని పోరాటం చేసిన యోధుడు --దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు --తుంగతుర్తిలో దామన్నవల్లనే మం దుల సామెల్ కు 50 వేల మెజార్టీ --దామోదర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి -- ఆర్ డి ఆర్ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి

 

Aicc CMRevanthReddy : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాజకీ యాలలోకి వచ్చి ప్రజాసేవ కోసం సొంత ఆస్తులను సైతం ప్రజాసేవ కో సం ధారబోసిన గొప్ప నాయకుడు దివంగత నేత మాజీ మంత్రి, సీని యర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు. ఆదివారం తుంగ తుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దామోదర్ రెడ్డి దశదిన కార్య క్రమానికి హాజరై సంతాప సభలో ప్రసంగిస్తూ మాట్లాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జి ల్లాలోని కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం దామోదర్ రెడ్డి పేరు తె లవని వారు లేరన్నారు. తుంగతుర్తి ని యోజకవర్గం నుండి ఎమ్మె ల్యేగా నాలుగుసార్లు సూర్యాపేట నుండి ఒక సారి గెలుపొంది కాంగ్రె స్ పార్టీని ప టిష్టం చేయడంలో అలుపెరుగని పోరాటం చేసిన గొ ప్ప యూదుడని అన్నారు. ఫ్లోరైడ్ తో బాధపడుతు న్న నల్లగొండ జి ల్లా ప్రాంతం ప్రజల ను కాపాడ డానికి గోదావరి జలాలను తుంగ తు ర్తి ప్రాంతానికి తీసుకు వచ్చిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అ ని అన్నారు.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించిన దా మోదర్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇటు ఉ మ్మడి నల్లగొండ జిల్లాలో సైతం అ త్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అ ని అన్నారు.దివంగత నేత దామో దర్ రెడ్డి సోదరుడు రామిరెడ్డి వెంక టరెడ్డి సైతం కాంగ్రెస్ పా ర్టీ కోసం కృ షి చేసిన వ్యక్తి అని ఇద్దరు సోదరు లు జోడెడ్ల మాదిరి గా కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేశారని అన్నారు. తుంగతుర్తి ప్రాం తం సూర్యాపేట ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అది దామోదర్ రెడ్డి కృషి వళ్ళని అన్నారు.

దామోదర్ రెడ్డి వేసిన కాంగ్రెస్ పార్టీ బీజాలు అత్యంత పటిష్టంగా ఉండ డం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి ఒక్క రూపాయి కూ డా ఖర్చు పెట్టని మందుల సా మేల్ 50 వేల మెజారి టీతో గెలు పొందాడని ఆ ఘనత దామోదర్ రెడ్డి దేనని ముఖ్యమం త్రి అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన కాం గ్రెస్ పార్టీని గెలి పించడానికి దామో దర్ రెడ్డి ముందుండేవారిని కాంగ్రెస్ పార్టీ గెలు పు కోసం అహర్నిశలు కృ షి చేసిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని అభి వర్ణించారు.

దామోదర్ రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీలో తీర్చలేనిది అని కమి ట్మెంట్ తో కూడిన గొప్ప నాయకుడు కాంగ్రె స్ సిద్ధాంతాన్ని ప్రగా ఢం గా నమ్మిన వ్యక్తి అని అన్నారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసిసి అగ్ర నాయకు లు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖ ర్గే ,రాహుల్ గాం ధీలు, ప్రత్యేకంగా సంతాపం తెలిపారని వారి కుటుం బానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సందేశాన్ని వారికి అందిస్తున్నాన న్నారు. దా మోదర్ రెడ్డి కుటుం బా నికి రాజకీయంగా అన్ని విధాల అటు ఎఐ సిసి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పా ర్టీ తోడుగా ఉంటుందని అన్నారు.

అలాగే ఎన్నో ఉద్యమాలు చేసి తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జ లాలను తీసుకువచ్చిన అపర భగీరధులు దామోదర్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు నామకరణం చేస్తున్నట్లు వేలాది మంది ప్రజల హర్షద్వారాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక టించారు .దామోదర్ రెడ్డి ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరు కృషి చే యాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కాంగ్రెస్ పా ర్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో మంత్రులు రాష్ట్ర ఉప ము ఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ఉత్తంకు మార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీని యర్ కాంగ్రెస్ నాయకుడు కుం దూరు జానారెడ్డి, వి.హనుమంత రావు, దివంగత నేత దామోదర్ రెడ్డి తనయుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.