Alappal court : హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష
--సంచలన తీర్పు వెల్లడించిన అలప్పుళ కోర్టు --బిజెపి నాయకుని హత్య కేసులో సంచలన తీర్పు
హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష
–సంచలన తీర్పు వెల్లడించిన అలప్పుళ కోర్టు
–బిజెపి నాయకుని హత్య కేసులో సంచలన తీర్పు
ప్రజాదీవెన/ కేరళ: కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బిజెపి నేత హత్య కేసును సుదీర్ఘంగా విచారించిన మావెలిక్కర అదనపు కోర్టు న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ సంచలన తీర్పు విలువరించారు.
నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన అనంతరం క్షమాభిక్ష కోరేందుకు నిందితులు అర్హులు కారని న్యాయమూర్తి తీర్పులో స్ప ష్టంగా పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యులైన తల్లి, భార్య, కూ తురి ఎదుటే ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అరుదైన నేరం గా పరిగణిస్తూ నేరానికి తగ్గట్టుగా మరణశిక్ష విధించాలంటూ ప్రాసి క్యూషన్ డిమాండ్ చేసింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన నిం దితులు హత్య చేసేందుకు శిక్షణ తీసుకున్నారని అలాంటి వారు బ యటకు వస్తే దేశానికే ప్రమాదం అని ప్రాసిక్యూషన్ కోర్టుకు క్షుణ్ణంగా తెలిపింది. హత్యలు పాల్గొన్న 15 మంది నిందితులకు శిక్ష ఖరారు సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెంగ న్నూరు, కాయంకుళం డీఎస్పీల ఆధ్వర్యంలో పహారా కాస్తు ఎటువం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
అలప్పుళ డీవైఎస్పీ ఎన్ఆర్ జయ రాజ్ కేసు దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కే సులో ప్రాసిక్యూషన్ 156 మంది సాక్షులను విచారించమే కాకుండా సుమారు వెయ్యి డాక్యుమెంట్లు, దాదాపు వంద ఆధారాలు బయట పడ్డాయి. గూగుల్ మ్యాప్స్ సహాయంతో తయారు చేసిన వేలిముద్ర లు, సీసీటీవీ ఫుటేజీ, రూట్ మ్యాప్‌లతో సహా అనేక ఆధారాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారాయి.
డిసెంబర్ 19, 2021న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రంజిత్ శ్రీనివాసన్ హత్యకు గురయ్యారు. రంజిత్ మార్నింగ్ రైడ్‌కి వెళ్లేందుకు వెళ్లగా వెల్లకినార్ లోని తన ఇంట్లోనే హత్య చేయగా తల్లి, భార్య, కూతురు ముందే రంజిత్‌ను నిందితులు అతి కిరాతకంగా నరికి చంపారు. అప్పట్లో ఈ హత్య నేను సంచలనం సృష్టించింది. ప్రధానంగా కమ్యూనల్ కోణం లో జరిగిన ఈ హత్య రాజకీయ దుమారానికి కూడా దారి తీసింది.
దేశంలోనే నిషేధిత ఉగ్రవాద సంస్థ తరఫున ఈ హత్యలో 15 మంది నిందితులు పాల్గొనడంతో కేరళ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణానికి ఆస్కారమైంది. హత్య జరిగిన వెంటనే కేరళ పోలీసులు అప్రమత్త మై పటిష్టమైన బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఎట్టకేలకు హత్యలో పాల్గొన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ కు సంబంధిం చిన 15 మంది నిందితుల కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువ రించడం పట్ల కేరళ ప్రజలు మృ తుని కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేస్తున్నారు.