Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagan Defeat: ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలనకు చరమగీతం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకో పాలనకు శరణగీతం పాడి కూటమికి పట్టం కట్టారని తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు అన్నారు.

ప్రజా దీవెన, కోదాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకో పాలనకు శరణగీతం పాడి కూటమికి పట్టం కట్టారని తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ(Telugu Desam State Organization Secretary) ముత్తినేని సైదేశ్వర రావు అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ఎన్నికలఫలితాలలో సైకో జగన్మోహన్ రెడ్డిని(Psycho Jaganmohan Reddy in Andhra Pradesh election results) ఇంటికి పంపి, తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు మంగళవారం కోదాడ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీఆధ్వర్యంలో ,సంబరాలను నిర్వహించారు ముందుగా పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పూలమాలలు వేసి నివాళులర్పించారు .

అనంతరం పట్టణములో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ర్యాలీ నిర్వహించి రంగా థియేటర్ సెంటర్ నందు బాణాసంచిపేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు .ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తినేని సైదేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ యూనివర్సిటీ (NTR University)పేరు మార్చి అన్న క్యాంటీన్ మూసివేసి ప్రజా నేత చంద్రబాబును జైల్లో పెట్టి రాజధాని లేని రాష్ట్రం గా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని ఎన్నికల ఫలితాలలో వైయస్సార్ పార్టీని ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు గుండ్లపల్లి సురేష్ , భయ్యా నారాయణ ,కోడె వాసు, కోదాడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పగండ్ల శ్రీనివాసరావు, చాపల శ్రీను, కొండ సోమయ్య, కొల్లు సత్యనారాయణ, రేవంత్ రెడ్డి, ముత్తవరపు కోటేశ్వరరావు, హరి, రామ్మోహన్, హబీబ్, కొత్త రాంబాబు, ముండ్ర రామారావు, ముండ్ర రవి, బాబా, రామయ్య, సహదేవ్, రాంబాబు, రోశయ్య,సుబ్బారావు ,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Andhra pradesh jagan rule ending