Annadanam: అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం
పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు
అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం
ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో(Abhayanjaneya Swamy Temple) దాతల(donor) సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం కావడంతోఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామికి(Anjaneya Swamy) ఆకు పూజ, పంచామృత అభిషేకాలు, తిరొక్క పూలతో ప్రత్యేక అలంకరణ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన దాతలు నాగరాజు, శ్రీనివాసరావు నెలవారి దాతలు రాంప్రసాద్, రంగా శ్రీను సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని దాతలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకురి అంజయ్య,ఆలయ సెక్రటరీ కోట. తిరుపతయ్య, అన్నదాన నిర్వాహకులు దేవరశెట్టి. హనుమంతరావు ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, సత్యం, బ్యాటరీ చారి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Annadanam at Abhayanjaneya Swamy Temple