Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anyone can become CM in a democratic party: ప్రజాస్వామ్య పార్టీలో ఎవ్వరైనా సీఎం కావోచ్చు

--మీడియా సమావేశంలో ఎంపీ, నల్లగొండ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజాస్వామ్య పార్టీలో ఎవ్వరైనా సీఎం కావోచ్చు

–మీడియా సమావేశంలో ఎంపీ, నల్లగొండ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/నల్లగొండ: దేశంలోనే ప్రజాస్వామ్యం అధికంగా కల్గిన పార్టీ కాంగ్రెస్ అని భువనగిరి ఎంపీ, నల్లగొండ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కిరణ్ కుమార్ రెడ్డి నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సీఎం కాలేదా అని గుర్తు చేశారు. నల్లగొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదవ నిజాం అని ఎద్దేవా ( Telangana Chief Minister KCR is the eighth Nizam)  చేశారు. సోనియాగాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్, కేటీఆర్ లకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు.

ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీది త్యాగాల కుటుంబమని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ త్యాగాల మీద సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. నిజాం పాలన, దొరల పాలనను తలపిస్తున్న సీఎం కేసీఆర్ పాలనను అంతమొందిం చడానికే కాంగ్రెస్ ను గెలిపించాలని ( The CM wants to win the Congress to end the Nizam’s rule and the rule of the aristocracy)  ప్రజలను కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి ప్రతి పైసా ను రికవరీ చేస్తామని పునరుద్ఘాటించారు.

కెసిఆర్ పాలనలో ఇరిగేషన్, రెవిన్యూ శాఖలకు మంత్రి లేడని అంతా తానై నడిపిస్తున్నాడని ఆరోపించారు. పనికిమాలిన శాఖలకు మంత్రుల నియమించి డబ్బులను దండుకోవడానికి ప్రధాన శాఖలకు సీఎం కేసీఆర్ మంత్రులను నియమించలేదని (  CM KCR did not appoint ministers to the main departments to collect money by appointing ministers to useless departments) ద్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దోచుకున్నదంతా బయటకు కక్కిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పాలనలో దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని కెసిఆర్ ను మూడోసారి గెలిపిస్తే మోసపోతామని, గోసపడతామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను ఏ స్థానంలో ఉన్న తనకు రాజకీయ జన్మను ఇచ్చిన నల్లగొండ నియోజకవర్గాన్ని ఎప్పటికీ మర్చిపోనని ( He will never forget the Nalgonda constituency that gave him political birth)  పునరుద్ఘాటించారు. నల్లగొండ నియోజక వర్గంలో మిగిలిపోయిన పనులన్నింటిని పూర్తి చేస్తానని వెల్లడించారు.