AndhrapradeshOpinionPoliticsతెలంగాణహైదరాబాద్

Ap ex minister Karumuri Nageswara Rao Arrest : బిగ్ బ్రేకింగ్, లిక్కర్‌ రవాణా కే సులో కీలక పరిణామం, ఏపీ మా జీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్‌

Ap ex minister Karumuri Nageswara Rao Arrest ప్రజా దీవెన, హైదరాబాద్‌: ఏపీ లిక్కర్‌ రవాణా కుంభకోణం కే సులో కీలక పరిణామం చోటుచే సుకుంది. వైకాపా ప్రభు త్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మ ద్యం రవాణా అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత కారుమూరి నాగేశ్వ రరావును ఈడీ అధికారులు అరెస్ట్‌ చే శారు.హైదరాబాద్‌ కొండా పూర్‌లో కారుమూరి నాగేశ్వర రా వును అదుపులోకి తీసుకున్న అధికారులు అనంతరం బషీ ర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.

రూ.28 కోట్ల ముడుపులoటున్న ఈడీ

లిక్కర్‌ రవాణా కాంట్రాక్టుల్లో అక్ర మాలకు పాల్పడినట్లు ఈ డీ ఆరోపిస్తోంది. కాంట్రాక్టులు దక్కేలా టెండర్‌ నిబంధనల ను మార్చి, అనుకూల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చిన ట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు చెబుతు న్నారు. ఈ వ్యవహారంలో కాంట్రా క్టుల ద్వారా సుమారు రూ.28 కో ట్లు ముడుపులుగా తీసుకున్నట్లు ఈడీ పేర్కొంటోంది.

ప్రభుత్వానికి రూ.195.33 కోట్ల నష్టం?

లిక్కర్‌ రవాణా కుంభకోణం కా రణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల మేర నష్టం వా టిల్లినట్లు ఈడీ ఆరోపిస్తోం ది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, కాం ట్రాక్టుల కేటాయిం పు, టెండర్‌ నిబంధనల మార్పులపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కారుమూరి నాగేశ్వరరావు అరె స్టుతో ఏ పీ లిక్కర్‌ కుంభకోణం కేసు మరోసారి రాజకీయంగా, దర్యా ప్తుపరంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Back to top button