College Admissions: కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు ధరఖాస్తులు
విద్యా సంవత్సరం 2024 మార్చి లో 10వ, తరగతి ఉత్తీర్ణులై జిపిఏ 7, ఆ పైన పొందిన, నల్లగొండ జిల్లాలోని యస్సి,యస్టి, బిసి, ఇబిసి, మైనార్టీ, దివ్యాంగుల, విద్యార్థులు కార్పోరేట్ కళాశాల యందు అడ్మిషన్ కు నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఈనెల 30 వరకు గడువు
జిపిఏ 7 కు పైన సాధించిన విద్యార్థులకు అవకాశం
ప్రజా దీవెన నల్గొండ: విద్యా సంవత్సరం 2024 మార్చి లో 10వ, తరగతి ఉత్తీర్ణులై జిపిఏ 7, ఆ పైన పొందిన, నల్లగొండ జిల్లాలోని యస్సి,యస్టి, బిసి, ఇబిసి, మైనార్టీ, దివ్యాంగుల, విద్యార్థులు కార్పోరేట్ కళాశాల యందు అడ్మిషన్ కు నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో(Online) ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.
అర్హతలు ఇవే….
– ధరఖాస్తు చేసుకొను విద్యార్థులు ఏదేని సంక్షేమ శాఖల వసతి గృహములలో గడిచిన 3 సం. రాలు వసతి పొంది, ప్రభుత్వ లేదా ఎయిడెడ్, ఆశ్రమ పాఠశాలలు, (కెజిబియస్) కస్తుర్బా పాఠశాల యందు చదవినవారై ఉండాలి.
– అంతేకాకుండా ప్రభుత్వ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు జవహర్ నవోదయ విద్యాలయములో చదివిన విద్యార్థులు అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న బెస్ట్ అవైలబుల్ స్కీం యందు చదివిన వారు కూడ అర్హులు.
విద్యార్థుల (తల్లి/దండ్రుల) సంవత్సర ఆదాయం యస్సి, యస్టి, బిసి, ఇబిసి, మైనార్టీ దివ్యంగుల విద్యార్థుల వారికి అర్బన్ లో రూ.2.00 లక్షలు (పట్టణ ప్రాంతం), రూ.1.50 లక్షలు (గ్రామీణ ప్రాంతం) మించరాదు.
స్కాన్ చేయాల్సిన పత్రాలు…
విద్యార్థులు ఆన్-లైన్లో ధరఖాస్తు(Apply online) చేసుకొనే అప్పుడు ఈ క్రింద చూపిన దృవ పత్రములను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
– విద్యార్థి మార్చి, 2024లో పరీక్ష వ్రాసి పాస్ అయిన 10వ, తరగతి హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరములు పొందుపరచాలి.
– కుల దృవీకరణ పత్రము మీ సేవా నుండి పొందినది జతపర్చలి
– ఆదాయ దృవీకరణ పత్రము కూడ మీ సేవా నుండి 1 ఏప్రిల్ 2024 తరువాత పొందినది ఉండాలి.
– విద్యార్థి పేరున బ్యాంకు అకౌంట్ తీయాలి. బ్యాంకుపేరు, ఆయొక్క అకౌంట్ నెంబర్ను ధరఖాస్తులో చూపాలి.
– ఆధార్ కార్డు నెంబర్ తప్పక కల్గివుండాలి.
– రేషన్ కార్డు ప్రతి / ఫుడ్ సెక్యురిటి కార్డు జత పరచాలి.
– పాస్పోర్టు సైజ్ ఫోటోను జతచేయాలి.
– విద్యార్థి ఏదేని కళాశాలను ఎంచుకొనవచ్చును.
– దివ్యాంగులు అయినచో సంబంధిత దృవీకరణ పత్రం జతపర్చవలెను.
– విద్యార్థులు telanganaepass.cgg.gov.in అను వెబ్సైట్ నందు నమోదు చేసే అప్పుడు. సూచించిన అన్ని దృవీకరణ పత్రాలు తప్పని సరిగా కల్గివుండాలి. ఏ దృవీకరణ పత్రము లేకున్న అడ్మిషన్ ఇవ్వబడదని స్పష్టం చేశారు.
Applications for admissions in corporate college