Approval of Finance Department…! ఆర్థిక శాఖ ఆమోదం…!
-- ' ఉపాధ్యాయ 'నియామకానికి పచ్చజెండా -- 5,089 పోస్టుల భర్తీకి ప్రారంభమైన ప్రక్రియ -- నిరుద్యోగుల్లో వెళ్లివిరుస్తున్న ఆనందోత్సాహం
ఆర్థిక శాఖ ఆమోదం…!
— ‘ ఉపాధ్యాయ ‘నియామకానికి పచ్చజెండా
— 5,089 పోస్టుల భర్తీకి ప్రారంభమైన ప్రక్రియ
— నిరుద్యోగుల్లో వెళ్లివిరుస్తున్న ఆనందోత్సాహం
ప్రజా దీవెన /హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు సంబంధించి చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా పూర్తి చేసింది.
తెలంగాణలో మొత్తం 5089 పోస్టుల నియామకానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జీవో 96 జారీ అయింది. దీంతో డీఎస్సీ మార్గదర్శకాల రూపకల్పనపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అధికారిక సమాచారం ప్రకారం దరఖాస్తులను ఆన్లైన్ లోనే స్వీకరించనుండగా పరీక్షలను ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
గురు కుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీ బీటీ) పద్ధతిలో నిర్వహించగా, డీఎ స్పీని సైతం ఇదే తరహాలో నిర్వ హించే అంశంపై విద్యాశాఖ అధికా రులు పూర్తిస్థాయి కసరత్తులో నిమగ్నమయ్యారు.
టీచర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలో 80 మార్కులకు నిర్వహించనుండగా ఆ ప్రశ్నపత్రంలో మాత్రం 100 ప్రశ్నలకు గాను అంటే ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున కేటాయించి టెట్ కు 20 మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నారు.
డీఎస్సీ నోటిఫి కేషన్ విడుదల పరీక్ష నిర్వహణ రాష్ట్రస్థాయిలోనే అయితే, ఫలితాలు ప్రకటించిన తర్వాత జిల్లాలవారీగా మెరిట్, సెలె క్షన్ జాబితాలు విడుదల చేస్తారు. కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ఈ పోస్టుల భర్తీని చేపడుతుంది. కాగా, పాఠశాల విద్యా శాఖ అధికారులు డిఎస్సీ ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరంగా కొనసాగుతుంది.