Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:34 pm Posted by : praja deveena

Art of living : గౌతమి కళాశాలలో ఆధ్యాత్మిక సందడి, విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ భజనలు

 

Art of living  :ప్రజా దీవెన నల్లగొండ టౌన్: విద్యార్థుల్లో మాన సిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన ను పెంపొందించే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నల్ల గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి కళాశాలలో ప్రత్యేక భజన కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గాయకుడు అమిత్ నారాయణ్ బృందం ఉత్సాహభరితంగా నిర్వహిం చిన భజన కార్యక్రమం విద్యార్థి నులను విశేషంగా ఆకట్టుకుంది.సుమారు గంటపాటు సాగిన ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం కళాశాల ప్రాంగ ణంలో ఆనందో త్సాహాలను నింపింది. భక్తిగీతాల మధుర స్వరాలకు విద్యా ర్థినులు లయబద్ధంగా అడుగులు వేస్తూ, ఆ టపాటలతో సందడి చేశారు. సంగీతం, భక్తి, ఆధ్యా త్మికత కల గలిసిన ఈ కార్యక్ర మం ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని నింపింది.

     మానసిక ప్రశాంతతకు ధ్యానమే మార్గం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యా ర్థులు ఎదుర్కొంటున్న ఒత్తి డిని అధిగమించేందుకు ధ్యానం, భజ నలు, సానుకూల ఆలో చనలు ఎంతగానో దోహదపడతాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృం దం వివరిం చింది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రతికూల ఆలో చనలను విశ్లేషించి వాటిని అధిగ మించడం, ధ్యానం ద్వారా మాన సిక స్థిరత్వాన్ని పెంపొందించు కోవడం వంటి అంశాలను విద్యా ర్థులకు అర్థమయ్యే రీతిలో వివ రించారు.

 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా ఏకాగ్రతను పెంపొం దించుకోవడంతో పాటు చదు వులో మెరుగైన ఫలితాలు సాధిం చేందుకు అవసరమైన మానసిక ప్రశాంతతను పొం దవచ్చని పే ర్కొన్నారు. విద్యార్థుల దైనందిన జీవితంలో ధ్యా నం, సానుకూల దృక్పథాన్ని భాగం చేసుకోవాలని సూచిం చా రు.

    విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం

భజనలతో పాటు ఆధ్యాత్మిక సందేశాలను అందించిన ఈ కా ర్యక్రమం విద్యార్థులకు ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అం దించింది. చదువుతో పాటు మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికా సానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటి చెప్పింది.ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వా లంటీర్లు గుండ గోని జయశంకర్, పోగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.