ఆర్యవైశ్యుల మనోభావాలు కాపాడుతాం
–-నల్లగొండ మునిసిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్
ప్రజా దీవెన/ నల్లగొండ: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యు ల మనోభావాలను, ఆత్మగౌరవాలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పేర్కోన్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యుల కోరిక మేరకు వైశ్యుల కులదైవo వాసవీమాత దేవాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మార్కెట్ ను రద్దుచేసి దాని స్థానం లో పూల మార్కెట్ ఏర్పాటుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం తీసుకున్నారని రమేష్ గౌడ్ తెలిపారు.
సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో పలువురు ఆర్యవైష్యులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టణ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్యవైశ్యుల మనోభావాలు గౌరవించినందుకు మంత్రి వెంకటరెడ్డి కి పాలాభిషేకం చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ మార్కెట్ చుట్టూ వైశ్యుల గృహాలు, మార్కెట్ ఎదురుగా వైశ్యులు కులదైవం వాసవి మాత దేవాలయం ఉన్నప్పటికీ గత పాలకులు తమ ఆకాంక్షలకు విరుద్ధంగా మాంసం మార్కెట్ ను ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక మాంసం మార్కెట్ ను రద్దుచేసి ఆలయ పవిత్రతను కాపాడాలని తామందరం మూకుమ్మడిగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.
అదే విషయాన్ని విన్నవించిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా మాంసం మార్కెట్ ను మార్చి దాని స్థానంలో పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు అదేశించి వైశ్యుల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. అంతకుముందు మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్ రావు, టీటిడి అడ్వైసరీ బోర్డ్ మెంబెర్ తేలుకుంట్ల శ్రీనివాస్, ఐ వి ఎఫ్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు పారేపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి, కోశాధి కారి గోవిందు బాలరాజు, వామ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వందన పు వేణు, అర్థం శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యా మ మురళి, పట్టణ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా రేషన్ డీలర్ ల సంఘం అధ్యక్షు డు పారేపల్లి నాగరా జు, తదితరులు తమ ప్రసంగాలలో మంత్రి వెంకట్ రెడ్డి సహాయాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అర్రురు సత్యనారాయణ, నాయకు లు నల్గొండ అశోక్,నల్గొండ శ్రీని వాస్, వనమ మనోహర్, వనమ రమే ష్, బోనగిరి ప్రభాకర్, అని ల్,ఇమ్మడి వెంకటేశ్వర్లు, నెలంటి కృష్ణ య్య, చంద్ర శేఖర్, చంద్ర య్య, సురేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
*సాలార్ జంగ్ మీర్ తురబ్ అలీఖాన్ జయంతి వేడుకల్లో….* నిజాం హయాంలో హైదరాబాద్ ప్రధానమంత్రి గా సాలార్ జంగ్ మీర్ తురబ్ అలీఖాన్ అనేక సంస్కరణలతో రెవిన్యూ శాఖకు రూపు రేఖ లు తెచ్చాడని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో బహ దుర్ ఖాన్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సాలార్ జంగ్ మీర్ తురబ్ అలీ ఖాన్ గారి 195 వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్ర పటా నికి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా బంధీ రూపొందించి భూ రికార్డులు లేని రాజ్యంలో భూ రికార్డులకి రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. అన్ని గ్రామా ల్లోనూ భూముల సర్వే చేసి భూ రికార్డులు రూపొందించాడని వివ రించారు. ఈ కార్యక్రమంలో కౌన్సి లర్ లు మాతంగి సత్యనారాయణ, అమీర్, బషీరొద్దీన్, మైనా రిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబెర్స్ నజీర్, అజాం, రియాజ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.