Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Awards for best teachers: ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

-- ఈ ఏడాది 54 మంది టీచర్ల ఎంపిక

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

— ఈ ఏడాది 54 మంది టీచర్ల ఎంపిక

ప్రజా దీవెన / హైదరాబాద్‌ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు.
2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవోను జారీచేశారు.

ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, డైట్‌కాలేజీల్లో పనిచేస్తూనే, ఉత్తమ సేవలందించినందుకు గాను వీరిని అవార్డులు వరించాయి. హెడ్‌ మాస్టర్‌ కేటగిరిలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరిలో 20 మంది, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ,కేటగిరిలో 11 మంది, డైట్‌ లెక్చరర్‌ కేటగిరిలో ఒకరు, స్పెషల్‌ కేటగిరిలో 12 మంది టీచర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గురుపూజోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో సన్మానిస్తారు. అలాగే అవార్డు కింద రూ. 10వేల నగదుతో పాటు సర్టిఫికేట్‌ అందజేస్తారు.

పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జేబీఎస్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ రేపాక నరసింహారెడ్డి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన సందర్భంగా పిఆర్టియు తెలంగాణ నల్లగొండ అర్బన్ శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.