Ayodhya temple : ఆ సమయంలో పూజారి ముఖం కప్పుకున్నారెందుకు
--రాముని ప్రాణప్రతిష్ట సమయంలో పూజారి ముఖంపై వస్త్రం
ఆ సమయంలో పూజారి ముఖం కప్పుకున్నారెందుకు
–రాముని ప్రాణప్రతిష్ట సమయంలో పూజారి ముఖంపై వస్త్రం
ప్రజా దీవెన/ అయోధ్య: అయోధ్యలో రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతదేశమే కాకుండ ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రారంభోత్సవం రోజున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పూజలు నిర్వహిస్తూ, ప్రసాదాలు పంచి పెడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మహత్తర ఘట్టంలో ప్రజలు పాలుపంచు కున్నారు.
ఎప్పుడో త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని వీడిన రా ముడు మళ్లీ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడని హిందువులు సంతోషిస్థూ రామనామ జపంతో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతు న్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నేరుగా చూడలేని వారు టీవీలలో చూసి పరితపిoచారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహం దైవ స్వరూపంగా మారుతున్న పవిత్రమైన దృశ్యాలను అం దరూ చూస్తూ తరిస్తే, గర్భగుడిలో ఉన్న ఒక పూజారి మాత్రం ఆ దృ శ్యాలు చూడకుండా తన ముఖం మీద ఒక వస్త్రాన్ని కప్పుకున్నారు. సీసీ టీవీ కెమెరాల్లో ఈ దృశ్యం కనిపించింది. ఎందుకు అలా చేశా రు, దీని వెనక ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు.
బాల రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టాపన సమ యంలో గర్భ గుడిలో చాలామంది పూజారులు ఉన్నారు. వారి లో పెజావర్ మఠదీశా స్వామి విశ్వ ప్రసన్న తీర్ధ అనే పూజారి ఒకరు. ఉడిపికి చెందిన ఈ స్వామీజీ తన ముఖాన్ని కండువాతో కప్పుకోవ డం వెనక కారణాలు, ఆచారాలు ఉన్నాయని ఒకరు వెల్లడించారు.
ఇలా చేయడం విశ్వ ప్రసన్న తీర్ధ స్వామికి దేవుడితో ఉన్న అనుబం ధాన్ని తెలియ చేస్తుందని సహన సింగ్ నెటిజెన్ సోషల్ మీడియా వేదికగా తెలియపరిచారు. ఆమె కూడా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.ఆమె ప్రకారం పెజావర్ మఠదీశా స్వామి ము ఖాన్ని వస్త్రంతో కవర్ చేసుకోవడం వెనుక ఒక ఆచారం ఉంది.
ఒడి శాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో స్వామి వారికి నైవేద్యాన్ని సమ ర్పిం చినప్పుడు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఆ ఆచారం ఏం టంటే స్వామివారికి సమర్పించిన నైవేద్యం కలుషితం కాకుండా పూ జారులు ప్రజలు ముక్కు, నోటిని కప్పి ఉంచుకుంటారు. దీనిని “మధ్వ ఆచారం” అంటారు.
ఈ ఒక్క ఆచారంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని దేవుళ్లకు నైవేద్యం సమర్పించినప్పుడు కూడా కళ్ళు మూసుకోవడం లేదా గుడి తలుపులు వేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నైవేద్యం సమర్పించినాక మొదట దేవుడే భుజించే లా జాగ్రత్త పడతారు. ఆ సమయంలో ఆ ఆహార పదార్ధాలపై నర దిష్టి కూడా తగలకుండా చూస్తారు.