Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 10:24 am Posted by : praja deveena

babu jagjivan ram jayanti : సామాజిక సమానత్వానికి కృషిచేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

 

babu jagjivan ram jayanti : ప్రజా దీవెన, నల్లగొండ: సా మాజిక సమానత్వానికి కృషిచేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రా మ్ అని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్ట ర్ బాబు జగ్జీవన్ రా మ్ 119 వ జ యంతిని పురస్కరించుకొని జిల్లా సాంఘిక సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశా ల ఎదురుగా నిర్వహించి న సమావేశంలో ఆమె మాట్లాడారు.

భారత దేశంలో అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవ న్ రామ్ అని, చిన్న వయసులోనే స్వాతం త్ర సమరంలో పా ల్గొని భారత దేశ స్వాతంత్రానికి కృషి చేశారని, దేశ నిర్మా ణంలో ప్రముఖ పాత్రపోషిం చారని, కార్మిక, రక్షణ, వ్యవసా య శాఖ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అని అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశా నికి గొప్ప సందే శమని, ఆయన ఆ శయాలు ఆదర్శంగా తీడుకొని స మసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్క రు కృషి చేయాలని, వారి ఆశయా లకు ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లా డుతూ మహనీయుల ఆశయాల ను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అం దరిపై ఉందని అన్నా రు .22 ఏళ్లకే స్వతంత్ర ఉద్యమం లో పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని కృషి చేశార న్నారు. కార్మిక చట్టాలను తీసుకు రావడమే కాకుం డా, ఇండో -పాక్ యుద్ధంలో చతుతను చాటారని తెలిపా రు.

చదువు కుటుంబానికి, సమాజా నికి ఏ విధంగా ఉపయోగ పడుతుందో విద్యార్థులు ఆలోచించాలన్నారు.ఉన్నత చదు వులు చదవాలని, సమాజాన్ని ఎలా ముందుకు తీసుకు వె ళ్లాదో ఆలోచించాలని, ప్ర భుత్వం పేదప్రజల సంక్షే మానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు క ల్పిస్తున్నదని, వాటిని స ద్వినియోగం చేసుకో వాలని కోరారు.మారుతున్న సాం కే తి క పరిస్థితుల కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉ ప యోగించుకోవాలని, సాంకేతికతను అందిపుచ్చు కోవాలని చెప్పా రు.

డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ ఆధనపు కలెక్టర్ జె.శ్రీని వా స్, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, దళిత సం ఘాల నాయకులు వున్న కైలాస్ నేత, మాజీ జెడ్పిటిసి ల క్ష్మయ్య, మార్పాక నరేందర్, పెరి కా షణ్ముఖ కుమార్, పాల డుగు నాగరాజు, కవితా రాణి, గోలి ఏ డుకొండలు, పెరిక స్వాతి, శ్రీని వాసరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కు మార్ ,బుర్ర సుధాకర్ కత్తు ల సంజీవయ్య, అవుట రవీంద ర్, చక్కిలం రామరాజు, పెరిక శెట్టి, దుప్పల లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి, ధనలక్ష్మి ,సైదులు, కాటం శివ తదితరులు మాట్లా డారు. ఈ కార్యక్ర మంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అ దనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి,జిల్లా అధికారులు, సంఘాల నాయకు లు పాల్గొన్నారు.

అంతకు ముందు మర్రిగూడ బైపాస్ వద్ద డాక్టర్ బాబు జగ్జీ వన్ రామ్ విగ్రహానికి అధి కారులు, ప్రజాప్రతినిధులు, సం ఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించా రు. అలాగే ఎన్ జి కళాశాల వద్ద డాక్టర్ బాబు జగ్జీవ న్ రామ్ విగ్ర హా నికి పూలమాలవేసి నివాళులు అర్పించా రు.