Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 3:03 pm Posted by : praja deveena

Bay of Bengal ships Tragedy : బిగ్ బ్రేకింగ్, బంగాళాఖాతంలో పెను విషాదం, కాలగర్భంలోకి రెండు నౌకలతో 500 మంది దుర్మరణం 

Bay of Bengal ships Tragedy : ప్రజా దీవెన, మయ న్మార్: మెరు గైన ఆశ్రయం, సురక్షితమైన భవిష్యత్తును వె తుక్కుంటూ సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం ఘోర వి షాదం తో ముగిసింది. బంగాళా ఖాతంలో అత్యాధునిక శోధన వ్య వస్థలకు సైతం చిక్కకుండా రెండు శరణార్థుల నౌకలు సము ద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి (U N), అంత ర్జాతీయ వలసల సంస్థ (IOM) సంయుక్తంగా ధృ వీకరించాయి.గత నెల చివరి వారంలో మయ న్మార్ లోని ‘రాఖైన్’ తీర ప్రాంత కంట్రోల్ రూమ్ నుండి ఈ నౌకలు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.

ఈ ప్రమాదంలో మొదటి నౌక సుమారు 250 మంది ప్రయా ణికులతో బయలుదేరిన ఈ నౌక, ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేప టికే తీరప్రాంత రాడార్‌ వ్యవస్థల తో సంబంధాలను కోల్పోయింది. సముద్ర ఉధృతికి అది అక్కడికక్కడే మునిగి పోయినట్లు శాటిలైట్ డేటా సూచిస్తోంది. ఇక రెండవ నౌక 2 80 మంది శరణార్థులతో ప్రయాణమై ఈ నెల 8వ తేదీన ‘అ యేయార్వాడీ’ తీర ప్రాంతంలో సిగ్నల్స్ కోల్పోయి జలస మాధి అయింది.

     తుది నివేదికల సారాంశం

అంతర్జాతీయ రెస్క్యూ టీమ్‌ల అత్యాధునిక స్కానింగ్ ని వే దికల ప్రకారం ఈ రెండు నౌకల్లోని ప్ర యాణికులలో ఎవరూ బతికే అ వకాశం లేదని, అందరూ సము ద్రంలో మునిగి మ రణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మయన్మార్ రో హింగ్యాలతో పాటు బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల నుండి తప్పించుకుని, కొత్త ప్రపం చంలో అడుగుపెట్టాలని చూసిన వందలాది మంది కలలు సముద్ర గర్భంలోనే కలిసిపోవడం అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తోంది.