AndhrapradeshOpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

 BC Association Leader Jajula : బీసీ సంఘం నేత జాజుల అల్టిమేటం, ఫీజు బకాయిలు ఇవ్వకపోతే కాక్రోచ్‌లతో కలసికదంతొక్కుతాం 

--కేంద్రానికి పట్టినగతే రాష్ట్ర ప్రభుత్వానికీ పడుతుంది --ఆగస్టులో ‘బీసీ విద్యార్థుల మిలియన్ మార్చ్’ --విద్యారంగ పరిరక్షణకు పోరు బాట

 

BC Association Leader Jajula : ప్రజా దీవెన, హైదరా బాద్: “దేశంలో ‘జెన్ జీ (Gen Z)’ తిరుగుబాటు ముగిసిపో లేదు సమాజంలో అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీ యాలు ఉన్నంత కాలం ఈ ఉద్యమం కొత్త కొత్త రూపాల్లో దా వానలంలా రగులుతూనే ఉం టుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీని వాస్ గౌడ్ ఘా టుగా ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవ న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఢిల్లీలో ఊ పందుకున్న ‘కాక్రోచ్ (బొద్దింకల) ఉద్యమం’ పై ఆయన మా ట్లాడారు.

యువతను, విద్యార్థి శక్తిని తక్కు వ అంచనా వేసినందుకే కేంద్ర పా లకులకు తగిన శాస్తి జరిగిందని ఆయన వ్యాఖ్యా నించారు. పేపర్ లీకేజీలు, అవినీతి, విద్యా వ్యవస్థను నాశ నం చేసే కుట్రల వల్లనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప దవికి రాజీనామా చేయాల్సి వ చ్చిందని గుర్తుచేశారు. నేపా ల్, బంగ్లాదేశ్‌లలో రాజుకున్న జెన్ జీ జ్వాలలు భారత్‌కు తా కుతాయని తాము ముందే హెచ్చరించినా, ప్రభుత్వాల ని యంతృత్వ వైఖరి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లో మొదలైన ఈ ‘కాక్రోచ్ నిరసనలు’ త్వరలోనే తెలంగాణ తో పాటు దేశమంతటా విస్తరిస్తాయని స్పష్టం చేశారు.

తీవ్ర సంక్షోభంలో తెలంగాణ విద్యారంగం

 

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక పోవడం, ఫీజు రీయింబర్స్‌ మెం ట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజ మాన్యాల వేధింపులు తాళలేక ఏడుగురు విద్యార్థులు ఆ త్మహత్యలు చేసుకో వడం అత్యంత విచారకరమని ఆవేద న వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది యువత ఆ గ్రహంతో రగిలిపోతున్నారని తెలి పారు.”ఢిల్లీలో కాక్రోచ్ ఉద్యమం ఏ రీతిలో విస్ఫోటనం చెందిందో, తెలంగాణలో నూ అంతకంటే తీ వ్రస్థాయిలో ఆగస్టు నెలలో ఉద్య మి స్తామని హెచ్చరించారు.

ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం ఫీ జు రీయింబర్స్‌మెంట్ బకా యిల న్నింటినీ వెంటనే విడుదల చే యాలని, లేనిపక్షంలో వేలాది మంది విద్యార్థులతో ‘చలో హైద రాబాద్’ పిలుపు నిచ్చి, సుందర య్య విజ్ఞాన కేంద్రం నుండి ఇం దిరా పార్క్ వరకు చారిత్రాత్మక ‘బీసీ విద్యార్థుల మిలియన్ మార్చ్’ ని ర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

Related Articles

Back to top button