Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:10 pm Posted by : praja deveena

BC Chairman Jajula Srinivas Goud : బీసీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoనయం 

 

BC Chairman Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ విద్యా ర్థుల ఉన్నత చదువుకు భరోసా క ల్పించడానికి 2008లో గత కాం గ్రె స్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమం త్రి వైఎస్ రా జశేఖర్ రెడ్డితో పోరాడి, ఫీజుల రియంబర్స్మెంట్ పథకా న్ని సాధించుకున్నమని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత బిఆ ర్ఎస్ ప్రభుత్వం నుండి నేటి కాంగ్రె స్ ప్రభుత్వం వరకు సంపాదిం చు కున్న ఫీజుల రియంబర్స్మెంట్ పథ కాన్ని నీరుగారుస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌ డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరా బాదులోని బీసీ జేఏసీ కార్యాలయంలో బీసీ సంఘాల నే తలతో కలిసి మీడియాతో జాజూ ల శ్రీనివాస్ గౌడ్ మాట్లా డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బీసీల విషయంలో గత ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం లోనే తీరని అన్యా యం జరుగుతుందని, ఎమ్మెల్యే సీటు నుండి మొదలుకొని సీఎం సీ టు వరకు ఒకే సామాజికవ ర్గానికి చెందినవారు ఏలుతున్నారని, బీసీ లకు కనీసం చదు వుకోడానికికూడా అవకాశం కల్పించడం లేదని ఆయన ఆవే దన వ్యక్తంచేశారు. రా ష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు గా ఫీజుల రియంబర్స్మెంట్ బకా యిలు విడుదల చేయకపో వడంతో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ, వేలాదిమంది వి ద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత వి ద్యకు దూరం అవుతున్నారన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభు త్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుం టూనే, ఇంకొక వైపు ఫీజుల రియంబర్స్మెంట్ పథ కాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందన్నారు, ఫీజుల బకా యిలు చెల్లించకపోవ డంతో ప్రైవేట్ కళాశాల యజమా న్యాలు ఇటివల హైకోర్టును ఆశ్రయించడంతో నిన్న హైకోర్టు విచా రించి ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం అ మలు చేయ కపోతే విద్యార్థుల నుండే అడ్మిషన్ల సమయం లో కాలేజీలు ఫీజులు వ సూలు చేసుకోవచ్చని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత విద్యార్థులకు ఆ పీజుడ బ్బులు తి రిగి విద్యార్థులకు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందన్నా రు, ఈ తీర్పు పేద వి ద్యార్థుల ఉన్నత చదువులకు గు ది బండలా మారుతుందని ఆయన అన్నారు.

నిన్న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలను తీవ్ర గందరగో ళంలోకి నె ట్టివేసిందని, రాష్ట్ర ప్రభుత్వానికి బీ సీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే హైకోర్టు తీర్పుపై సీఎం రే వంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి వి క్రమార్క స్పందించి ఫీజు ల రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరి నీ స్పష్టంగా ప్రకటించాలని ఆ యన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్ర భుత్వం బీసీలకు ఇంత అన్యా యం తల పెడుతున్న మౌనంగా చూ స్తూ కూర్చున్న బీసీ మంత్రులు తమ పదవులకు తక్షణమే రాజీ నామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీల ప్రయోజనాలకు పాటుపడని పదవులు ఎందుకని ఆయన ప్రశ్నించారు బీసీ బిడ్డలు గా రాజీనామా చేసి ఫీజు లు ఇవ్వ కుండా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయ కుండా బీ సీలపై ని ర్లక్ష్యం వహిస్తున్న అగ్రకుల కాంగ్రెస్ ప్రభు త్వం పై తిరగబడాలని బిసి మంత్రులకు శ్రీనివాస్ గౌడ్ సూ చించారు. హైకోర్టు తీర్పు దరిమిల ఫీ జుల రియంబర్స్మెంట్ పథ కాన్ని రక్షించుకోవడం కోసం బీసీ సమాజం పెద్ద ఎత్తున ఆం దోళనకు సిద్ధం కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు.

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్య క్షులు గొడుగు మహేష్ యాదవ్ ఆ ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం లో బీసీ జేఏ సీ వర్కింగ్ చైర్మన్ గు జ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్క చర్ల శ్రీని వా స్ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్, బండి గా రి రా జు, ఆవుల నరేష్, ఏ నరసమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నా రు.