
BC Leaders Issue Ultimatum : ప్రజా దీవెన, హైదరా బాద్: జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలు, రా ష్ట్ర బడ్జెట్ లో 60 శాతం పన్నులు చెల్లించి ఖజానా నింపితే, ఖజానా మీద కూర్చున్న అగ్రకుల పాలకు లు, బీసీలు చదువుకోడా నికి ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఏండ్ల తరబడి అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని, ఇదే వైఖరి ప్రభుత్వాలు వివరి స్తే బీసీలు ఏకమై తిరగబడే రోజు లు దగ్గరలోనే ఉన్నాయని అఖిల పక్ష బీసీ నేతలు తీవ్రంగా హెచ్చ రించారు. మంగళవారం హైదరా బాదులోని కాచిగూ డ లో ఉన్న హోటల్ అభినంద్ గ్రాండ్ లో బీసీ విద్యార్థి సం ఘం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ పై విధించిన జీవో 7 రద్దు చేయాలని, పాత పద్ధతిలో నే ఫీజుల పథకాన్ని అమ లు చేయాలనే ప్రధాన డిమాండ్ తో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అ ధ్యక్షులు తాటికొండ విక్ర మ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ ఆధ్వ ర్యంలో జరిగిన స మావేశానికి మాజీ గవర్నర్ బండా రు ద త్తాత్రేయ, ప్రభుత్వ సలహాదా రులు వి హనుమంతరావు, బి ఆర్ ఎస్ శాసనసభ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, టీజేఎస్ నేత జస్వంత్ కుమార్ హాజరయ్యారు.
మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్రంలోని 12 లక్షల పేద విద్యార్థుల జీవితాలతో చెల గాట మాడోద్దాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని చివరిసారిగా హెచ్చరిస్తున్నా మని, తక్షణమే పాత పద్ధతిలో ఫీ జు రియంబర్స్మెంట్ పథకాన్ని అ మలు చేసి బకాయిలు విడుదల చే యాలని ఆయన డిమాండ్ చేశా రు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఫీజుల పథకాన్ని అమలు చేయ డం లేదని, ఇది పాత పథకమని దీనిని ఎ త్తివేయడానికి అ నేక కుట్రలు ప్రభు త్వం చేస్తుందని అందులో భాగంగానే క ళాశాల యజమాన్యాలు కో ర్టుకెళ్లిన ప్రభుత్వం పట్టించుకోక పోవడం మూలంగానే రాష్ట్ర హైకోర్టు లో పేద విద్యార్థుల వ్య తిరేక తీర్పు వచ్చిందని, ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 7 తీ సుకువచ్చి ఈ స్కీము ను రద్దు చేయాలని కుట్ర చేసింద న్నారు, ప్రభుత్వం ఫీజులు ఇవ్వలే ని పరిస్థితులు ఉందా అ ని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం ఏమైనా ధీవాల తీస్తుందా అని ఆయన మం డిపడ్డారు. తక్షణమే జీవో నెంబర్ 7 రద్దు చేసి, పాత పద్ధతిలో ఫీజుల స్కీమును అమలు చేయాలని దత్తాత్రేయ కోరారు.
కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదా రులు వి హనుమంతరావు మాట్లా డుతూ కాంగ్రెస్ అధిష్టానం తనకు ప్రభుత్వ సమాధా లుగా నియమిం చి అందులో బీసీ సంక్షేమ శాఖను తనకు అప్పజెప్పిందని, సీఎం రే వంత్ రెడ్డి నాకు పదవి ఇచ్చినం దుకు నాకు ఒక్కనికి సంతోషం కాద ని, మొత్తం బీసీలు సం తోషపడి తే నే తాను సంతోషపడతానని ఆ యన తెలిపా రు. గతంలో 20O 8లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఫీజులు రి యంబర్స్మెంట్ ను ఎంతో గొ ప్ప గా తీసుకువచ్చిందని, దాని ని ఇం కా పకడ్బందీగా అమలు చేయాలని చిత్త శుద్ధితో ప్ర భుత్వం ముందు కు సాగాలని, అలా కాకుండా మళ్ళీ కాంగ్రె స్ ప్రభుత్వమే ఫీజుల స్కీం ఎగ్గొట్టిందని పేరు తీ సుకురావద్ద ని ఆయన తెలిపారు. ఫీజుల రి యంబర్స్మెంట్ పై రోజురోజు కు త నపై బీసీల నుండి ఒత్తిడి పెరుగు తుంద ని, అతి త్వ రలోనే సీఎం రే వంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమా ర్కను కలిసి పాత పద్ధతిలో పేదల రియంబర్స్మెంట్ స్కీమ్ అ మలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిల ను విడుదల చేయాలని కోరుతానని వి హెచ్ తెలిపారు.
బిఆర్ఎస్ శాసన మండలి పక్షనేత సిరికొండ మధుసూదనా చారి మా ట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా బీ సీల పట్ల మొద టి నుండి సవతి త ల్లి ప్రేమ చూపిస్తున్నాయని, పన్ను లు కట్టడమే బీసీల వంతు అయిం దని, బీసీలకు నిధులు విడు దల చేయాలంటే అగ్రకుల ప్రభుత్వా ల కు మనసు రావడం లేదన్నారు.ప్రభుత్వాలు మారినప్పుడు ఆస్తు లు పెంచడం, అప్పులు పంచడం సాధారణంగా జరిగేది అని, గత ప్రభు త్వం ఫీజు లు బకాయిలు పెట్టిందని ఈ ప్రభుత్వం అసలు ఫీజుల రి యంబర్స్మెంట్ నే రద్దు చేస్తామని అనాలోచిత ని ర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. మూసి సుం దరీకరణ, ఫ్యూచర్ సిటీ పే రుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తామ ని చెబుతున్న రేవంత్ రెడ్డి, 12 లక్షల మంది పేద విద్యార్థుల ఉ న్నత విద్య కోసం 7500 కోట్లు ఇవ్వలేడా అంటూ ఆయ న ప్రశ్నించారు. బీసీ లు ఇంకా ఎన్ని రోజులు అడుక్కో వాల ని, ఫీజుల నిధులు ఇచ్చేవర కు బీసీ సంఘాలు చేస్తున్న పో రాటాన్ని అఖిలపక్షం మద్దతుగా ఉంటుందని ఆయన తెలి పారు.
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అ ధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ లు మాట్లాడుతూ పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసిన తర్వాతనే రాష్ట్రం లో అడ్మిషన్ల కౌన్సిలింగ్ చేపట్టాల ని, ఫీజులపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం మొండిగా కౌన్సిలింగ్ ని ర్వహిస్తే వేలాదిమంది విద్యార్థుల తో కౌన్సిలింగ్ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ సమావే శంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ కో చైర్మన్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జెఎసి కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర, టీజే ఎస్ పార్టీ ప్రతినిధి జస్వంత్ కు మార్, బీసీ జేఏసీ నాయకులు చం ద్రశేఖర్ గౌడ్, వేముల రామకృష్ణ, దీటి మల్లయ్య, కౌలే జగన్నాథం, గోద వరుణ్ కుమార్ గౌడ్, నరసిం హ నాయక్, జిల్లెల నరసింహ, తా రాకేశ్వరి, సమతా యాదవ్, సం ధ్యారాణి, స్వర్ణ గౌడ్, కొప్పుల చం దు గౌడ్, గజ్జల సత్యరాజ్ గౌడ్, సుజాత, గౌతమి, ఇంద్రం రజక, గూడూరు భాస్కర్ , నాగరాజుగౌ డ్, మాదేశి రాజేందర్, నరసింహ చారి, బ్రహ్మచారి, మణికంఠ, తది తరులు పాల్గొన్నారు.






