Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 5:16 pm Posted by : praja deveena

Bc unions leaders strong worning : బీసీల సమాధానమిచ్చిన తర్వాతే ప్రధాని తెలంగాణకు రావాలి

 

Bc unions leaders strong worning ప్రజా దీవెన, హై దరాబాద్ : గత 11 ఏళ్ల పాలనలో బిజెపి బీసీలకు వరగబె ట్టింది ఏమీ లేదని, ముచ్చ టగా మూడోసారి ప్రధానిగా పద వి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని, పైగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జ నగణలో బీసీ కులగణన చేపడతా మని చెప్పి, తీరా ఇప్పుడు కులగ నన చేయకుండా మోసం చేస్తున్నా రని బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపిం చారు. ఈ సందర్భంగా ప్రధానికి అందించిన పది ప్రశ్నలను జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాకు విడుద ల చేశారు.

ప్రధానికి బీసీల 10 ప్రశ్నలు ఇలా ఉన్నాయి..జాతీయ జన గణనలో సమగ్ర కుల గణన చేపడుతామని ఏప్రిల్ ఒకటి 2025వ తేదీన ఢిల్లీ లో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ యం ఏమైంది. ఏప్రిల్ ఒకటి 2026వ రోజు నుండి దేశవ్యా ప్తం గా చేపడుతున్న మొదటి దశ కు టుంబాల లెక్కింపులో ఓబీసీ కు టుంబాలను ఎందుకు లెక్కించడం లేదు. మహి ళా బిల్లులో ఓబీసీ మ హిళలకు సబ్ కోట ఎందుకు కల్పిం చడం లేదు. తెలంగాణ రాష్ట్ర అ సెంబ్లీలో బీసీల విద్యా ఉ ద్యోగ రాజకీయ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ఏకగ్రీవ ఆమోదంతో చే సిన చట్టాన్ని గత సంవత్సరం కాలంగా ఆ మోదించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు . దేశవ్యా ప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితి ని ఎందు కు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు.

అదే విధంగా మీ 11 సంవత్సరాల పరిపాలనలో దేశంలోని 80 కోట్ల మంది బీసీల సంక్షేమానికి ఎందు కు ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదు.54 లక్షల కోట్ల కేం ద్ర బడ్జెట్ లో జనాభాలో 60 శాతం ఉన్న ఓబీసీల సంక్షేమా నికి రెండు వేల 400 కోట్ల నిధులు కేటాయిస్తే బీసీలు అభి వృద్ధి చెంద డానికి ఎన్ని వేల సంవత్సరాలు ప డుతుంది. దేశంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా రిజర్వేషన్ ఉ న్నది, చివరికి అగ్రవర్ణాలకు కూడా 10% ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో రిజ ర్వేషన్లు కల్పించిన మీరు ఓబీసీల కు జనాభా దామాషా ప్రకారం రిజ ర్వేషన్లు ఎందుకు పెంచడం లేదు.
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపె ట్టి చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజ ర్వేషన్లు ఎందుకు కల్పించడం లేద ని, మండల్ కమిషన్ సిఫార్సులను అమ లు చేయకుండా గత 11 సం వత్సరాలుగా ఎందుకు తొక్కి పెడు తున్నరని నిలదీశారు.

పైన పేర్కొన్న ఈ ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ జవాబు చెప్పిన త ర్వాతనే తెలంగాణలో అడుగు పె ట్టాలని లేదంటే పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజక వర్గ మండల కేంద్రాల్లో నల్లజెండా లతో నిరసన ర్యాలీలు చేప డుతా మని, హైదరాబాదులోని అమరవీ రుల స్థూపం వద్ద నిరసన తెలుపు తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్ల డించా రు ఈ నెల 9వ తేదీన వి హ నుమంతరావు చేపట్టబోయే ఆమ రణ నిరాహార దీక్షకు బీసీ సంఘాల పూర్తి మద్దతు ఉంటుందని ఆయ న తెలిపారు. తెలంగాణ రాష్ట్రo కోసం శ్రీకాంత్ చారి బలిదానం చే సుకొని చరిత్రలో నిలిచిపోయా ర ని, తాను కూడా బీసీ కుల గణన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెం చడానికి 75 వయసులో ఆరోగ్యం బాగా లేకు న్నా ఆమర నిరాదీక్ష చేపడుతున్నానని, బీసీల కడుపు కా లి, అన్యాయం జరుగుతూ ఉం టే చూస్తూ ఊరుకోలేకనే కఠిన మై న నిర్ణయం తీసుకున్నానని ప్రభుత్వ సలహాదారు లు వి హనుమంతరావు వెల్లడించారు.

ఓ బి సి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ తరఫున 9 10 తేదీల్లో చేపట్టబోయే నిరసన కార్యక్రమాల లో కాంగ్రెస్ శ్రేణులు సంపూర్ణంగా పాల్గొంటామని షాద్ నగర్ శాస న సభ్యులు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ రా ష్ట్ర చైర్మన్ ఈర్లపల్లి శంకర్ వెల్లడిం చారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ సిరి కొండ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ ఓబీసీలను లెక్కించకపోవడం అంటే దేశంలో ఓబీసీల అస్తిత్వాన్ని కనుమరుగు చేయడమేనని, రాజకీయ పార్టీల కు అతీతంగా ఓబీసీ కులగణన సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రత చేయాలని, ఈనెల 10వ తేదీన చేపట్టబోయే నిరసన కార్య క్రమా లు ఢిల్లీకి వినిపించేలా కార్యాచ రణ రూపొందించాలని ఇందుకు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు తెలిపారు ఇండియా పాకిస్తాన్ విభజించిన ట్టుగా తెలంగాణను విభజించారని బిజెపి ఎంపీ మాట్లాడితే, తెలంగా ణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించప రిచిన బిజెపి నేతలు ఎవరు దీనిని ఖండించకపోవడం చాలా దుర్మార్గ మన్నారు.

ఇటు తెలంగాణకు, అటు ఓబీసీ లకు వ్యతిరేకమైన బిజెపి కి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, బీసీల తడాఖా ఏందో కేంద్ర ప్రభు త్వానికి రుచి చూపించాలని వారు తెలి పారు. సిపిఐ రాష్ట్ర నాయకు లు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మా ట్లాడుతూ కేంద్రం బీసీల పట్ల పూ ర్తిగా వివక్షత ప్రదర్శి స్తుందని, బీసీ ల పేరు చెప్పుకుని పబ్బం గడిపే ప్రధాని బీసీ లకు న్యాయం చేయ డంలో పూర్తిగా విఫలం చెందారని ఆ యన ఆరోపించారు ఈ నెల 10 న తెలంగాణ రాష్ట్ర పర్యట న విచ్చే స్తున్న నరేంద్ర మోడీకి బీసీల సెగ ను వినిపించడా నికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాలు పెద్ద ఎత్తున ఆందో ళన కార్యక్రమాల్లో పాల్గొనా లని, వామపక్షాల తరఫున ఈ ప్రజాస్వామ్య ఆందోళనలో తాము పాలుపంచుకుంటామని ఆయన తెలిపారు

ఈ సమావేశంలో బీసీ జేఏసీ వ ర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుం దరం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అ ధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముది రాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీ య అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ కో కన్వీనర్ ఉప్ప రి శేఖర్ సగర, బీసీ మహిళా సం ఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, టీజేఎస్ పార్టీ ప్ర ధాన కార్యదర్శి జస్వంత్ కుమార్, డెమొక్రటిక్ ఫ్రంట్ చైర్మన్ కోల జనా ర్దన్ గౌడ్, బూడిద మల్లికార్జున్ యాదవ్, పాను గంటి విజయ్ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, ఉద య్ నేత, విజయలక్ష్మి, ఆంజనే యులు సాగర్ తదితరులు పాల్గొన్నా రు.