Bc women bill delimitation : బీసీ సంఘాల అల్టిమేటం, బీసీ ల పై వివక్షవిడనాడకపోతే రైతుఉద్యమతరహలో ఢిల్లీని ముట్టడిస్తాం
--బీసీ మహిళలకు సబ్ కోట కల్పిం చకపోతే దేశంలో అగ్గిమండిస్తాం --బీసీలను చిన్నచూపు చూస్తే కేం ద్రానికి బీసీల తడాఖా చూపిస్తాం --బీసీ మహిళల ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును మేము ఒప్పుకోం --సంపూర్ణ కులగణన తర్వాతనే డీ లిమిటేషన్, మహిళాబిల్లు తేవాలి --బీసీ సబ్ కోట పై ప్రధాని తక్షణమే అఖిలపక్షo నిర్వహించాలి --ఢిల్లీలో ఓబీసీ మహిళా పోరు దీ క్షలలో అఖిలపక్ష నేతల హెచ్చరిక

Bc women bill delimitation : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: స్థానిక సం స్థల ఎన్నికలలో లాగానే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాల ని సబ్ కోట కల్పించిన తర్వాతనే మహిళా బిల్లుకు ఆమో దం తెలపా లని అఖిలపక్ష పార్టీల నాయకులు, ఓబీసీ నేత లు కేంద్ర ప్రభుత్వాన్ని సంయుక్తంగా డిమాండ్ చేశారు. గు రువారం ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద మహిళా బిల్లు లో బీసీ మ హిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీని వాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్య క్షు రాలు బి మనిమంజరి అధ్యక్షతన బీసీ మహిళల పోరుదీక్షను పెద్ద ఎ త్తున నిర్వహించారు.
ఈ దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు వి హనుమంత రావు, అని ల్ జైహింద్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, టిడిపి ఎం పీలు బీద మస్తాన్ రా వు, అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ అధ్యక్షులు కేసన శంకర్రా వు లు హాజరయ్యారుమొదటగా దీక్షలో కూర్చున్న వంద లాది మంది మహిళల నేతలకు మాజీ పార్లమెంట్ సభ్యులు పూల మాలవేసి పోరు దీక్షను ప్రారంభించారు.
ముందుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జా జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభు త్వం బీసీలను మరొ 80 సంవత్స రాలు రాజకీ యంగా ఎదగకుండా కుట్ర చేస్తుందని ఆయన ఆరోపిం చా రు. దేశంలో జనాభా లెక్కలు బీసీ కులాల లెక్కలు సేకరించి న తర్వాతనే నియోజకవర్గాల పెంపు, మహిళా బిల్లులో జనాభా దామా షా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ లకు ఒ క కోట క ల్పించాలని ఆయన డి మాండ్ చేశారు, దేశవ్యాప్తంగా డీ లి మిటేషన్ ద్వారా పెంచిన అసెం బ్లీ పార్లమెంటు సీట్లు మొ త్తం మ హిళా బిల్లు పేరుతో అగ్రకుల మహి ళలకు కట్టబె ట్టాలని కేంద్రం ఆలో చించడం చాలా దుర్మార్గమన్నారు.
మహిళా బిల్లులు బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకా రం వాటా దక్కాలని దేశంలోని అన్ని రాజకీ య పార్టీలు డిమాండ్ చేస్తున్నా యని, రాజకీయ పార్టీల డిమాండ్ల ను, దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను ప్రధా ని న రేంద్ర మోడీ గౌరవించి బీసీ మహి ళాలకు అండగా నిలబడాలని ఆ యన కోరారు.కులగన చేస్తామని మాట ఇ చ్చి నేడు జరుగుతున్న దే శవ్యాప్త జనగణనలో బీసీ కుటుం బాలను లెక్కించకపోవడం, 2027 జనాభా లెక్కల ను ప్రా మాణికంగా తీసుకోకుండా 2011 జనాభా లె క్కల ప్రతిప దికన కేంద్రం ముందు కు సాగడం బీసీలను నమ్మించి త డి గుడ్డతో గొంతుకోయడమేనని ఆ యన తీవ్రంగా మండిపడ్డా రు.
బీసీ కులగలను చేపట్టి మహిళా బి ల్లు బీసీ మహిళలకు స బ్ కోట క ల్పించకపోతే దేశంలో అగ్గి మండి స్తామని, భారత్ బంద్ నిర్వహించి తిరుతామన్నారు, కేంద్ర ప్రభుత్వా నికి బీసీ సమాజం తగిన బుద్ధి చె బుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హను మంతరావు, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఓబిసి సెల్ చైర్మన్ అని ల్ జైహింద్ యాదవ్ లు మాట్లాడుతూ మహిళా బిల్లు సబ్ కోట ఉండాలని ఇప్పటికే ఇండి యా కూటమి తరపున ప్రధా నికి లే ఖ రాశామన్నారు. దేశంలోని అన్ని పార్టీల అభిప్రా యాలు తీసుకొని ఏ కాభిప్రాయంతో మహిళా బిల్లు ఆ మో దించడానికి బీసీ మహిళలకు సబ్ కోట సాధన కోసం జాతీ య స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏ ర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రధాన ప్ర తిపక్షాల అభిప్రాయాలను గౌరవిం చి బీసీలకు న్యాయం చేయాలని బీసీల తరఫున పార్లమెంట్లో కాంగ్రె స్ పార్టీ గట్టిగా కొట్లాడు తుందని అ వసరమైతే బిసి ఉద్యమ సంఘాల తో కలిసి భారత్ బంద్ కు మద్దతు పలుకుతామని వారు హెచ్చరిం చా రు.
బిఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు ర విచంద్ర, శాసనసభ పక్ష నేత, మా జీ స్పీకర్ సి మధుసూదనా చారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ మహిళా బిల్లుకు టి ఆర్ఎ స్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్ర కటించిందని ఇదే సమయంలో బీ సీలకు రాజకీయ ప్రాతినీథ్యం లేని మహిళా బిల్లు సంపూ ర్ణం కాలేదని వారు అన్నారు, బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ గత 11 సం వత్సరాలుగా అన్యాయం చేస్తూనే ఈరోజు బీసీలపై వివక్షత చూపి స్తూ బీసీలకే రాజకీయ రిజ ర్వే షన్లు కల్పించకపోవడం దారుణమైన అన్యాయమని వా రు మండిపడ్డారు.బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పో రాడుతామని, డీలిమిటేషన్ ద్వారా బీసీలకు దక్షిణాది రా ష్ట్రాల కు అన్యాయం జరిగితే దేశంలో అగ్గిపుడుతుందని వారు హెచ్చరిం చారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స భ్యులు బీద మస్తాన్ రా వు, లక్ష్మీ నారాయణలు మాట్లాడుతూ తెలు గుదేశం పార్టీ విధానపరంగా బీసీ లకు అనుకూలమని, కేంద్రంలో భా గ స్వామ్యం అయినప్పటికీ బీసీల కు అన్యాయం జరిగితే తప్పకుం డా బీసీల తరఫున పోరాడుతామ ని వారు తెలి పారు. బీసీ మహిళా బిల్లులు బీసీ మహిళలకు సబ్ కో ట కల్పించే విషయంలో పార్టీ అధి నేత చంద్రబాబు నాయుడు చ ర్చించి బీసీల పక్షాన నిలబడతా మని న్యాయమైన బీసీ ల డిమాం డ్ ను సాధించుకోవడం కోసం తె లుగుదేశం పార్టీ పూర్తి అండదండ లు బీసీలకు అందిస్తుందని వారు ప్రకటిం చారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు మాట్లాడుతూ బీసీ మహిళలకు రాజకీయ ప్రాతి ధ్యాన్ని కల్పించి కేం ద్రం బీసీల పట్ల చిత్తూరు నిరూ పిం చుకోవాలని కోరారు బీసీలను వివ క్షత చూపించడం మోడీ కి తగద న్నారు.బీసీల రిజర్వేషన్ల విషయం లో కేంద్ర ప్రభు త్వం ఏమాత్రం నిర్ల క్ష్యం చేసిన భవిష్యత్తులో బిజెపి ప్ర భుత్వం రాజకీయంగా భారీ మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీసీ మ హిళా సంఘం అధ్యక్షురాలు బి మ ని మంజరి సాగర్ మాట్లాడుతూ మ హిళా బిల్లుపై ఉన్న చిత్తశుద్ధి బీ సీ మహిళల సబ్ కోటపై ఎందుకు లేదని కేంద్రాన్ని నిలదీశారు. మహి ళా బిల్లు పేరు తో మరొకమారు అగ్ర కుల ఎమ్మెల్యే ఎంపీలతో పాటు వా రి భార్యలు కుమార్తెలు, కోడళ్ళు స పరివార సమేతంగా చట్టస భలోకి అడుగు పెడతారని మహిళా బిల్లు వారసత్వ రాజకీ యాలకు, అగ్రకు ల రాజకీయ పునరావసానికి వేదిక అవు తుందని ఆమె తెలిపారు.
బీసీ మహిళలకు సబ్ కోట సాధిం చేవరకు ఢిల్లీని వదిలి పె ట్టేది లేదని అవసరమైతే పార్లమెంటును ము ట్టడించి తీరు తామని ఆమే హెచ్చరించారు. ఈ దీక్షలో బీసీ జేఏసీ వ ర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయ కురా లు ఇందిరా శోభన్, సునీతారావు, బీసీ మహిళా సం ఘాల నేతలు దా సరి ఉష, డాక్టర్ రమా, కుల్కచర్ల శ్రీనివా స్, తాటికొండ విక్రమ్ గౌడ్, కుందారం గణేష్ చారి, కనకల శ్యా మ్, కుమ్మరి క్రాంతి కుమార్, ప్రొఫె సర్ సంఘని మల్లే శ్వర్, తారకేశ్వ రి, సంధ్యారాణి, స్వర్ణ గౌడ్, సుజా త, మీనా దేవి, గౌతమి, రాజేశ్వరి, గూడూరు భాస్కర్, కవులే జగన్నా థం, శివప్రసాద్, ఉదయ్ నేత, తో పాటు తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్, మ హారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల నుండి వందలాది మంది మహిళలు అధ్యక్షులు పాల్గొన్నా రు.





