Believe it or not, human sacrifice: నమ్మించి నట్టింట నరబలి
--ఆరుగురి హత్యతో అమానుషం --స్నేహం ముసుగులో కిరాతకం --నిజామాబాద్ జిల్లాలో ఘోరం --ఇరువై రోజుల నుంచి కిరాతకం --ఇద్దరు చిన్నారులు, దివ్యాంగురాలు సైతం --వరుస హత్యలతో ఉలిక్కిపడిన మాక్లూర్ గ్రామం --యువతి మృతి కేసు దర్యాప్తుతో బయటపడ్డ అసలు విషయం
నమ్మించి నట్టింట నరబలి
–ఆరుగురి హత్యతో అమానుషం
–స్నేహం ముసుగులో కిరాతకం
–నిజామాబాద్ జిల్లాలో ఘోరం
–ఇరువై రోజుల నుంచి కిరాతకం
–ఇద్దరు చిన్నారులు, దివ్యాంగురాలు సైతం
–వరుస హత్యలతో ఉలిక్కిపడిన మాక్లూర్ గ్రామం
–యువతి మృతి కేసు దర్యాప్తుతో బయటపడ్డ అసలు విషయం
ప్రజా దీవెన/నిజామాబాద్: నమ్మకంతో వ్యాపార, వాణిజ్య పరంగా ద్రోహం తలపెట్టే ఈ రోజుల్లో అదే నమ్మకo తో నట్టింట నరబలి సృష్టించాడు ఓ దుర్మార్గుడు. నిజామాబాద్ జిల్లాలో అత్యంత హృదయ విదారక అమానవీయ ఘటన జరిగింది. ఊహకుకూడా అందని రీతిలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అశువులుబాసారు. తారాస్థాయికి చేరుకున్న మానసిక ఆందోళనతో జల్సాలకు అలవాటు పడిన ఓ సైకో తన స్నేహితుని తో పాటు పక్కా ప్రణాళికతో ఆరుగురిని హతమార్చాడు.
అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు, ఇద్దరు యువతులతో పా టు దంపతులను పొట్టనబెట్టుకున్న ఈ అమానుష దుర్ఘటన నిజా మాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పక్కా ప్రణాళికతో సినీఫక్కీలో జరిగిన ఈ హత్యలు సంచలనంగా మారగా హత్య చేసిన నిందితుల్లో ప్రశాంత్ అనే వ్యక్తి (25) కాగా మిగిలిన ఇద్దరు మైనర్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
నవంబర్ 28వ తేదీ నుంచి వరుసగా ఈ హత్యలను ముగ్గురు దుండగులతో కలిసి చేసినట్టు వెల్లడవుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన ఘర్షణ మూలంగానే హత్యోదంతం దాకా వచ్చినట్టు తెలుస్తున్నది. కామా రెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో డిసెంబర్ 14వ తేదీన వెలుగు చూసిన ఓ యువతి మృతదేహంతో అప్రమత్తమైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ విషయం గురించి డొంక కదిలింది.
హంతకుడు ప్రశాంత్, హత్యకు గురైన ప్రసాద్ కుటుంబానిది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రo స్వగ్రామం కావడం గమనార్హం. రాచర్లకూన ప్రసాద్ అనే వ్యక్తి ఉపాధి కోసం గల్స్కు వెళ్లి రెండేండ్ల క్రితం సొంతూరికి తిరిగొచ్చాడు. గల్ఫ్ లో ఉన్నప్పుడే ప్రసాద్ మూలంగా మోసపోయిన ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొoది.
ఈ ఘటనతో ప్రసాద్ కుటుంబం ఇల్లు వదిలి వేరే గ్రామానికెళ్లి స్థిరపడి ప్రసాద్ తన పేరిట ఉన్న ఎకరం భూమిని బాధిత కుటుంబానికి రాసిచ్చి ఈ వ్యవహారాన్ని ముగించుకొన్నారు. ఓ అమాయక యువతి ప్రాణాలను బలిగొన్న కారణంగా గ్రామంలో ప్రసాద్ కుటుంబంతో ఎవ్వరూ సత్సంబంధాలు పెట్టు కోకపోవడంతో కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి వెళ్లి తన కుటుంబంతో ప్రసాద్ బతుకుతున్నాడు.
ఈ సమ యంలో స్వగ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కుటుంబ పోషణకు అప్పు కోసం చూస్తున్న సమయంలో ప్రసాద్ కు ప్రశాంత్ దగ్గరయ్యాడు. యువతి మృతి కేసులో నిందితుడిగా ఉన్నందున ఆస్తి బదలాయింపు కష్టం అవు తుందని చెప్పి తన పేరిట ఆస్తులు రాసిస్తే లోన్ ఇప్పి స్తానంటూ ప్రసాద్ ను ప్రశాంత్ నమ్మబలికాడు. ఇదంతా నిజమేనని నమ్మి తన రెండు ఇండ్లు, ఒక ప్లాట్ను రాసిచ్చాడు.
కొద్దిరోజులకు ప్రసాద్ కు చెందిన ఒక ఇంటిని చెప్పా పెట్టకుండా వేరే వ్యక్తికి ప్రశాంత్ విక్రయించాడు. ఈ విషయం తెలియడంతో ప్రశాంత్ ను ప్రసాద్ నిలదీశాడు. ఇరువురి మధ్య కొద్దికాలం లోనే మొదలైన స్నేహం కాస్తా తీవ్ర వైరంగా మారింది. ఇల్లు విక్రయానికి సంబంధిం చిన డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తనకు రాజకీయ ప్రాబల్యం ఉందంటూ ప్రశాంత్ బెదిరింపులకు దిగాడు.
వారం, పది రోజులుగా ఇరువురి మధ్య జరుగుతున్న జగడం ముదర డంతో ప్రసాద్ ను ఆయన కుటుంబాన్ని మట్టుపెట్టాలని ప్రశాంత్ నిర్ణ యించుకొన్నాడు. స్థిరాస్తికి సంబంధించి హక్కుదారులె వ్వరూ ఉండ కూడదని భావించి కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని నిర్ణయాని కి వచ్చి ఈ ఘాతుకానికి పాల్ప డ్డట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44కు ఐదు కిలో మీటర్ల దూరంలో డిసెంబర్ 14న హత్యకు గురైన దివ్యాంగురాలైన ఓ యువతి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. లైంగికదాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల సీసీ టీవీ లను పరిశీలించగా ఒక అనుమానాస్పద కారును గుర్తించినట్టు తెలిసింది.
ఈ కారు నంబర్ తోపాటు సెల్ఫోన్ సిగ్నల్ డాటాను విశ్లేషించగా మాక్లూర్ మండలంలోని ప్రశాంత్ అనే యువకుడికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచా రించగా నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు హత్యా వివరాలు ఇలా ఉన్నాయి.
డబ్బులిస్తానని నమ్మించి తొలుత రాచర్లకు ప్రసాద్ ను ప్రశాంత్ తన వెంట తీసుకెళ్లి డిచ్ పల్లి హైవే పక్కన హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టాడు. దీంతో కొన్నిరోజులుగా ప్రసాద్ కనిపించకపోవడంతో అప్పులిచ్చినవారు అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాలని ప్రసాద్ భార్య రమణిని నమ్మించాడు.
తన వెంట తీసుకొని వెళ్లి బాసర వద్ద హత్యచేసి గోదావరిలో పడేశాడు. ఇక ప్రసాద్, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్ చెల్లి స్వప్న (దివ్యాం గురాలు)ను తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని కనిపించకుండా చేశాడు. ప్రసాద్ తల్లికి మాయమాటలు చెప్పి అతడి పిల్లలి ద్దరినీ నిజామాబాద్, నిర్మల్ జిల్లా సరిహద్దులోని సోన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి కిరాతకంగా చంపేసి, మృతదేహాలను కాలువలో పడేశాడు.
అందులో ఒక మృతదేహం ఈ నెల 8న లభించగా సోమవారం మరో మృతదేహం దొరికింది. ఇక వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారని నమ్మించి ప్రసాద్ మరో చెల్లి స్రవంతిని ప్రశాంత్ తన వెంట తీసుకెళ్లాడు. ఆమెకు నిప్పంటించి చంపేశాడు. ఈ 25 ఏళ్ల సీరియల్ కిల్లర్ ప్రశాంత్ పేద కుటుంబమే అయినా జల్సాలు చేసేవాడు. కొత్త కార్లు, బైక్లను కొని గ్రామంలో షో చేస్తుండటంతో కొంత మందిలో అతడిని ఫాలో అయ్యేవారు.
చిన్న వయసులోనే మాయమాటలు చెప్పడంలో ఆరితేరిన ప్రశాంత్ కు ఇంతకు మునుపు భూ లావాదేవీల విషయంలో పదుల సంఖ్యలో ప్రజలను మోసం చేసిన చరిత్ర ఉన్నది. వ్యవసాయ భూములకు రు ణాలు ఇప్పిస్తానం టూ తన పేరిట ఆస్తులను రాయించుకోవడం వాటిని వేరే వ్యక్తులకు అమ్మేసి జల్సాలు చేయడం రివాజుగా మారిం ది. ఎవరైనా ప్రశ్నిస్తే తనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ పలు వురి ఫొటోలు చూపిస్తూ బెదిరింపులకు దిగడం అలవాటుగా చేసుకున్నాడు.
మొన్నటి వరకు సైకిల్ కూడా లేని వ్యక్తి ఒక్కసారిగా కొత్త కారు, హైఫై సోకులను చూసి అమాయకులు అతని బుట్టలో పడిపోయారు ఇలా చాలా మంది మోసపోయి లబోదిబోమనగా ప్రసాద్ కుటుంబమైతే ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రశాంత్ నడిపించిన భూ దందాల్లో లోతుగా విచారణ చేస్తే మరికొంతమంది అదృశ్యమైన వ్యక్తుల వివరాలు బయటపడే అవకాశాలున్నట్టు మాక్లూర్ ప్రజలు భావిస్తున్నారు.