Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Indiramma houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించాలి

ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత భూమి లేని వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు రూ 12000, మహిళలకు రూ 2500 , ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న ఆరు గ్యారెంటీల హామీలలో ఉన్న ముఖ్యమైన వాటిని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం మహిళ కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ కాంగెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత భూమి లేని వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు రూ 12000, మహిళలకు రూ 2500 , ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు(Indiramma houses) ఇస్తామన్న ఆరు గ్యారెంటీల హామీలలో ఉన్న ముఖ్యమైన వాటిని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం మహిళ కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ కాంగెస్(Congress Govt) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ మండలం జి చెన్నారం లో జరుగుతున్న ఉపాధి హామీ కార్మికుల ను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సరోజ మాట్లాడు తూ అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు, పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల(Employment of labour) బకాయిల విడుద లకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్పాటంగా గ్రామీణ ప్రాంత పేదలకు ప్రకటించిన హామీల గురించి నేటి వరకు మాట్లాడకపోవడం ప్రభుత్వ దాటవేత చర్యలకు నిదర్శనం అన్నారు. భూమిలేని వ్యవసాయ కార్మికులను, ఇండ్ల స్థలాలు లేని పేదలను గుర్తించటానికి చర్యలు చేపట్టాలని కోరారు. స్థలాలు ఉన్నవారికి ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్న వాగ్దానం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఆ భూములపై హక్కు పట్టాలిచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,20,000 మంది వ్యవసాయ కూలీలు గ్రామీణ ఉపాధి కూలీలుగా(Rural Employment Labourers) పనిచేస్తున్నారని నాలుగు వారాల పైన కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించలేదని తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసే దగ్గర కనీస సౌకర్యాలు లేవని అన్నారు తాగడానికి మంచినీళ్లు కూడా సరఫరా చేయకపోవడం దుర్మార్గం అన్నారు.

ఎస్సీ ఎస్టీల బీడు భూముల అభివృద్ధికి చిన్న సన్నకారు రైతుల భూముల అభివృద్ధికి గ్రామీణ ఉపాధి పనులు పెట్టాలని డిమాండ్ చేశారు.చేసిన పనికి వారం వారం వేతనాలు చెల్లించాలని, పని చూపని దగ్గర నిరుద్యోగ భృతి చెల్లించాలని నిబంధనల ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. క్యూబిక్ మీటర్ల కొలతల పేరుతో చట్ట ప్రకారం 300 రూపాయలు వేతనం పడకుండా చేస్తున్నారని పని ప్రదేశంలో ఉదయం సాయంత్రం ఫోటోలు తీసే పేరుతో కూలీలను తీవ్రంగా వేధిస్తున్నారని తక్షణమే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కూలీలందరకు పారా పలుకు తట్ట గొడ్డలి కొడవలి వంటి పనిముట్లు ఇవ్వాలని కిలోమీటర్లు దాటిన పనికి లోకల్ ఆటో చార్జీ ఇవ్వాలని చట్టంలో ఉన్న అధికారులు అమలు చేయకపోవడం వలన కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఎండలు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని త్రాగడానికి మంచినీరు నీడకు టెంటు మెడికల్ కిట్టు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ మండల అధ్యక్షులు కట్ట అంజయ్య, మహిళా కూలీల జిల్లా కమిటీ సభ్యురాలు శోభ,బూరుగు బిక్షం, యాదమ్మ మేడగొని మారయ్య, మారగోని అంజయ్య, సరిత తదితరులు పాల్గొన్నారు.

Beneficiaries of Indiramma houses announced