Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 6:02 pm Posted by : praja deveena

Benguluru tragedy accident : బెంగళూరులో పెను విషాదం, ఆసుపత్రి గోడకూలి ఎనిమిది మంది దుర్మరణం

 

Benguluru tragedy accident : ప్రజా దీవెన, బెంగళూ రు: బెంగుళూరు నగరవాసులను విషాదం వెంటాడుతోంది. కురిసిన భారీ వ ర్షాల ధాటికి బౌరింగ్-లేడీ కర్ణన్ ప్ర భుత్వ ఆసుపత్రి ప్రహారీ గోడ ఒక్క సారిగా కుప్పకూలడంతో ఎని మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముగ్గు రు చిన్న పిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.

సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…భారీ వర్షాల కారణంగా ఆసుపత్రికి చెందిన పాత ప్రహారీ గోడ నానిపో యి, ఒక్కసారిగా పక్కనే ఉన్న గుడిసెలు నివాసాలపై పడిం ది. గోడ శిథిలాల కింద చిక్కుకొని ఎనిమిది మంది అక్కడి కక్కడే మృతి చెందారు. అందులో ముగ్గురు పసిపిల్లలు ఉండటం హృదయ విదారకం.

సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందా లు ఘట నా స్థలానికి చేరుకుని, శిథిలాలను తొలగించి మృ తదేహాలను వెలికితీ శాయి. ప్రభుత్వ స్పందన రాష్ట్ర ము ఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వ యంగా ఘటనా స్థలాన్ని పరి శీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల కు ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్షణమే విచారణ చేపట్టి బా ధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆ యన హామీ ఇచ్చారు.