
Bhogapuram International Airport : ప్రజా దీవెన, భో గాపురం: ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే స్తూ, అంత ర్జా తీయ విమానయాన రంగానికి నూతన కేంద్రాన్ని జోడిస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైభవంగా ప్రారంభ మైంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక వసతులతో సిద్ధమైన ఈ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశా రు. ఈ చారి త్రా త్మక ఘట్టంలో ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రా మ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్ పరిశీలన, పర్యటన
ప్రారంభోత్సవం అనంతరం ప్రధా ని మోదీ, గవర్నర్, చంద్ర బాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి దాదాపు 15 నిమిషాల పా టు టెర్మినల్ భవనంలోని డిజైన్లు, సౌకర్యాలు మరియు సాంకేతికతను క్షుణ్ణంగా పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి, పర్యాటక రం గానికి ఎలా సరికొత్త ఊపునివ్వ నుందో ఈ సందర్భంగా నా యకులు చర్చించారు.
సాంస్కృతిక వైభవం
రికార్డు స్థాయి “థింసా” ప్రదర్శనప్రారంభోత్సవంలో భాగంగా ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి, సాంప్ర దాయాలు ప్రపంచ దృ ష్టిని ఆకర్షించాయి. ఇదిలా ఉండగా ప్రధా ని మోదీ ప్రత్యే కం గా ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ ప్రదర్శనలను తిలకిం చారు.
ప్రపంచ రికార్డు గిరిజననృత్యం
ఏకంగా 13,500 మంది కళాకా రులతో రికార్డు స్థాయిలో నిర్వ హించిన సంప్రదాయ’థింసా నృత్యం’ ప్రత్యేక ఆక ర్ష ణగా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి ప్రతీకగా ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి జ్ఞాపికగా బొబ్బిలి వీణను బహుకరించారు.భోగాపురం ప్రారంభంతో ఉత్త రాంధ్ర ఇకపై కేవలం ప్రాంతీయ కేంద్రంగా కాకుండా, గ్లోబల్ ఏవియేషన్ మరియు ట్రేడ్ హబ్‌గా మారడానికి ప్ర యాణం ప్రారంభించింది.
ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్తరెక్కలు
భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రా రంభోత్సవంతో నవ్యాంధ్ర వికాస బాట లో సరికొత్త అధ్యా యం మొదలైంది. రూ.18,000 కోట్లకు పైగా విలువైన ప్రాజె క్టులతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి.ఈ సం దర్భంగా ప్రధాన మంత్రి న రేంద్ర మోడీ భవిష్యత్ మాట్లా డుతూ “ఇది అభివృద్ధి ల్యాం చ్ ప్యాడ్”పవిత్ర పుణ్యక్షేత్రా లై న సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవార్ల ఆశీస్సులతో స్వర్ణాంధ్ర విజన్‌కు ఇది అత్యంత కీలక మై న రోజని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.గిరిజన హక్కుల కోసం పోరా డిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజున డి యాడిన ఈ దివ్య భూమి నుంచే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ల్యాంచ్ ప్యా డ్ ప్రారంభమైంది. విమానాశ్రయాల పేర్లను ఒకే కుటుం బాని కి పరిమితం చేసే సంస్కృతికి స్వస్తి పలికి, అయోధ్యకు ‘వా ల్మీకి’ పేరు పెట్టినట్లే, ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్టుకు వీర విప్లవకారుడు ‘అల్లూరి’ పేరుతో నామకరణం చేసుకు న్నా మని పేర్కొన్నారు.
ఒకే రోజు రెండు చారిత్రాత్మక రికార్డులు
అంతర్జాతీయ స్థాయి మౌలిక వ సతులతో భోగాపురం అ ల్లూరి సీ తారామరాజు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడoతో పా టు వేలాది మంది కళాకారులతో నిర్వహిం చిన అద్భుత థింసానృత్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒకే రోజు రెండు రికార్డులు సృష్టించారన్నారు.
ఎర్రబస్సు రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చింది
ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఒక మణిహారమని, ఈ ప్రాంత దశ-దిశను మార్చే మహా ప్రాజెక్టు అని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థా పన చేసింది, పూర్తిచేసి జాతికి అంకితం చేసింది తమ ప్రభుత్వమేనని సీఎం స్పష్టం చేశారు. నాటి పౌర విమానయాన శాఖ మం త్రి అశోక్ గజపతిరాజు తొలి అ డుగులు వేయిస్తే, నేటి మంత్రి రా మ్మోహన్ నాయుడు దీనిని వేగవంతంగా పూర్తి చేశారని చెప్పారు.
ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో అ డుగడుగునా తెలుగు సాంస్కృ తిక ఉనికి ఉట్టిపడుతోందని, స మీప బీచ్ కారిడార్ పర్యా టక రంగా నికి సరికొత్త శోభను ఇస్తుందని వివరించారు. క ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోడీ ఆక్సిజన్ అందిం చా రని.. పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కుపరిరక్షణతో పా టు అమరావతికి నిధులు ఇచ్చారని కొనియాడారు.2028 నాటికి రాజ ధాని అమరావతి మొదటి దశ నిర్మాణ పను లన్నింటినీ సం పూర్ణంగా పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “దేశం కోసం నిలబడే నాయకుడికి అండగా ఉందామని ఉప ముఖ్యమం త్రి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ ప్రధాని మోడీ అకుంటిత సేవా నిర తి ని కొనియాడారు. నిమిషం కూడా సెలవు తీసుకో కుండా అహర్నిశలు దేశం కోసం శ్రమిస్తున్న ఏకైక మహానేత మోడీ అని పేర్కొ న్నారు. ప్రధాని పడుతున్న కష్టం నేటి త రానికి తెలియజెప్పాలని, రాజకీయ విమర్శలకు అతీతంగా దేశం కోసం నిలబడే నాయ కుడికి ప్రజలందరూ అండగా ని లవాలని పిలుపునిచ్చారు.
పరివర్తన బాటలో నవ్యాంధ్ర భో గాపురం విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకల కేంద్రం మాత్రమే కాదు అది ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల భవిష్య త్తును సరికొత్త ఎత్తు లకు తీసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు
భారతీయ విమానయాన విప్లవం
ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కేవలం బడా నగరాలకే పరిమితం. కానీ గత కొన్ని ఏళ్లలో భారతీయ ఆకాశంలో సం భవించిన మార్పులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
2014 కంటే ముందు దేశమంతటా కలిపి కేవలం 74 ఎయి ర్‌పోర్టులు మాత్రమే సేవలు అందించేవి. కానీ నేడు ఆ సం ఖ్య ఏకంగా 166కు చేరుకుంది. మౌలిక వసతుల కల్పనలో వేగం ఎలా ఉందో చెప్పడానికి ఈ సంఖ్యలే నిదర్శనం కేవ లం ఎయిర్‌పోర్టులు కట్టడమే కాకుండా, ప్రయాణాన్ని సా మా న్యుడికి అందుబాటులోకి తెచ్చింది ఉడాన్ప పథకం.
చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాలకు నేరుగా విమాన సేవ లు ప్రారంభమయ్యాయి.ఫలతంగా విమానాశ్రయాల సంఖ్య పెరగడమే కాకుండా, విమానాల్లో ప్రయాణించే పౌరుల సం ఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
కాశీ నుంచి అమృత్‌సర్ వరకు ‘స్పోక్ మోడల్’ విస్తరణ
అనుసంధానతను (Connectivity) పెంచడానికి కాశీలో ప్ర యోగాత్మకంగా ప్రారంభించిన ‘స్పోక్ ఎయిర్‌పోర్ట్ మోడల్’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ నెట్‌వ ర్క్ అమృత్‌సర్ వరకు విస్తరించి, ఆధ్యాత్మిక మరియు ప ర్యాటక ప్రాంతాలకు ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేసింది.
బ్లూ ఎకానమీ బలోపేతం
గగనతల అనుసంధానతతో పాటు సముద్ర తీర, జల రవా ణా ఆధారిత ‘బ్లూ ఎకానమీ’ (Blue Economy) ని కూడా ప్రభుత్వం వేగంగా బలోపేతం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వేగవంతమైన రవాణా, విస్తరిస్తున్న కనెక్టివిటీ ద్వారా భారతదేశం ప్రాంతీయ వృద్ధిలోనే కాకుం డా గ్లోబల్ విమానయాన రంగంలోనూ సరికొత్త అధ్యా యాన్ని లిఖిస్తోంది.









