Bhupal’s victory in Nalgonda is a walk on black: నల్లగొండలో భూపాల్ గెలుపు నల్లేరుమీద నడకే
--నల్లగొండ రూపురేఖలు మార్చిన ఘనత భూపాల్ రెడ్డిదే --బిఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రజలు సంసిద్దులయ్యారు --కొందరిని చేర్చుకొని జిమ్మిక్కులు చేస్తే అయ్యేది ఏమి లేదు -- అండర్ గ్రౌండ్ ఆగమాగం చెసింది కోమటిరెడ్డి కాదా --మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా బిఅర్ఎస్ ఇంచార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
నల్లగొండలో భూపాల్ గెలుపు నల్లేరుమీద నడకే
–నల్లగొండ రూపురేఖలు మార్చిన ఘనత భూపాల్ రెడ్డిదే
–బిఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రజలు సంసిద్దులయ్యారు
–కొందరిని చేర్చుకొని జిమ్మిక్కులు చేస్తే అయ్యేది ఏమి లేదు
— అండర్ గ్రౌండ్ ఆగమాగం చెసింది కోమటిరెడ్డి కాదా
–మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా బిఅర్ఎస్ ఇంచార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ప్రజా దీవెన/ నల్లగొండ: ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అని ఉమ్మడి జిల్లా బిఅర్ఎస్ ఇంచార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేర్కోన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే, బిఆరెస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జెడ్ పి ఛైర్మెన్ బండ నరేందర్ రెడ్డి, బిఆరెస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, కటికం సత్తయ్య గౌడ్, మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
20 సంవత్సరాలుగా నల్లగొండ నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని అసంపూర్తిగా వదిలేసిన ఘనత కూడా మీది కాదా అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి గెల్చిన తర్వాతనే నల్లగొండ రూప్రేఖలు మారాయని గుర్తు చేశారు.
అధికార పార్టీకి చెందిన కొంత మందిని లోబర్చుకొని కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఒరిగేది ఏమి లేదని ప్రజలంతా బిఆర్ఎస్ వెంటే వున్నారని స్పష్టం చేశారు. భూపాల్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని పునరుద్ఘాటించారు. ప్రజలు మా వెంటే వున్నారు. కాంగ్రెస్ కే గ్యారంటీ లేదని భూపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ముందు కోమటిరెడ్డి జిమ్మిక్కులు నడవవని ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు.
అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ ఉందని, పార్టీ నిద్రోహం చేసి వెళ్లిపోయిన వారికి ప్రజలే బుద్ధి చెవుతారన్నారు. కోమటిరెడ్డి కి కోతలు కోయడం తప్ప మరొకటి చేతకాదని, కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని వివరించారు.
కాంగ్రెస్ హయాంలో నల్లగొండ సర్వ నాశనం అయిందని ఆరోపించారు. నల్లగొండ ను దత్తత తీసుకొన్న సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ, ఐటి హబ్, కళాభారతి పూర్తి చేశారని ఏర్పాటు చేశారని వారి వివరించారు.