Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 9:16 am Posted by : praja deveena

Bike falls into well after losing control near Nalgonda : బిగ్ బ్రేకింగ్, అదుపుతప్పి బావి లో పడినబైక్, ప్రాణాపాయంలో వ్యక్తి

 

Bike falls into well after losing control near Nalgon da : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రమాద వశాత్తు బైక్ అదుపు త ప్పి బావిలో పడటంతో ఓ వ్యక్తి ప్రాణా పాయంలో చిక్కుకు న్నాడు. ఈ ఘ టన నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందు కున్న 108 అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి, చాకచ క్యంగా వ్యవహరించి బా ధితుడిని సురక్షితం గా బయటకు తీసి ప్రాణాలు కాపాడే ప్ర యత్నం చేశారు.

వివరాల్లోకి వెళ్తే కంచనపల్లి గ్రా మానికి చెందిన బీర్ల వీరయ్య (6 0) ప్రతిరోజు మాదిరిగానే ఉద యం 10 గంటల సమయం లో బైక్‌పై బయటకు బయలుదేరా డు. ఈ క్రమంలో ప్రమాదవ శాత్తు బైక్ అదుపుతప్పి సమీపంలోని బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంతో వీరయ్య బావిలో చిక్కు కుపోయాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తు లు ఏమాత్రం ఆలస్యం చేయ కుండా వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బం ది పరిస్థితిని పరిశీలించారు. బావిలో ఉన్న బాధితుడిని బ యటకు తీసుకు రావడానికి అంబులెన్స్‌లోని స్పై న్ బోర్డును వినియోగించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈఎంటీ సత్యనారా యణ, పైలట్ కోటేష్ధై ర్యసా హసాలు ప్రదర్శించారు. బావిలోకి దిగి, బాధితుడిని స్పైన్ బో ర్డుకు జాగ్రత్తగా కట్టి, గ్రామస్తుల సహ కారంతో పైకి తీసుకొచ్చా రు. అనంతరం అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, మెరు గైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించా రు.

ఆపద సమయంలో సమయ స్ఫూర్తి..సేవలోమానవత్వం

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, ఎంతో చాకచక్యంగా బా ధితుడిని బావి నుంచి బయటకు తీసుకొచ్చిన 108 అంబు లెన్స్ సిబ్బంది సత్యనారాయణ, కోటే ష్‌లను స్థానికులు అ భినందించారు. ఆపదలో ఉన్నవారికి సకా లంలో అందిన సహాయం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.