Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 11:20 am Posted by : praja deveena

Big Breaking Nalgonda municipality : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రజలకు శుభవార్త, మున్సిపల్ కార్పోరేషన్ గా నీలగిరి

 

Big Breaking Nalgonda municipality : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా కేంద్రం ప్రజ లకు శుభవార్త అందించింది. నల్లగొండ మున్సిపాలిటీని ము న్సిప ల్ కార్పోరేషన్ అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన అమెం డ్మెంట్ బిల్లుకు మంగళవారం రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలి పిం ది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పోరేష న్ గా అప్ గ్రేడ్ చేసేందుకు అవసర మున్న అన్ని అర్హతలు ఉన్నందున అధికార పార్టీ ప్రజాప్ర తినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న ప్ర భుత్వం ఆమెకు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ప్రమోట్ చేస్తూ నిర్ణ యం తీసుకుంది. దీంతో నల్లగొండ అధికార పార్టీ నాయకులతో పా టు ప్రజల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ఈ విష యంలో ఇప్పటికే పూ ర్తిస్థాయి ధీమాతో ఉన్న తాజా మా జీ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృ తజ్ఞతలు తెలియజేశారు.

నల్లగొండ మున్సిపాలిటీ కథా కమామీషు ఇలా... ప్రస్తుతం నల్ల గొండ జిల్లా కేంద్రలో 48 వార్డులు ఉండగా మరో రెండు వార్డులు పెరిగితే కార్పోరేషన్ గా మారిపోవడం సహజమైన నిబంధన అని తెలిసిం దే. నల్లగొండను కూడా కార్పోరేషన్ స్థాయి పెంచేందుకు జ నాభా లెక్కలు, వార్టుల్లో ఓటర్ల వివరాలను పరిగణలోకి తీసుకొని ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది.

కాగా నల్లగొండ పట్టణ జనాభా సుమారు 2.50 లక్షల వరకు ఉo టుందన్న అంచనాతో గత మున్సిపల్ ఎన్నికల్లో శివారు గ్రామాలను మున్సి పాలిటీలో విలీనం చేసినందున వా ర్డుల సంఖ్య 48కి పెరిగి న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విలీన ప్రతిపాధన లేకుం డా జనాభా ఆధా రంగా ఓటర్లు సంఖ్యను పరిగణలో కి తీసుకుని వార్డులను పెంచారు. అధికారిక సమాచారం మేరకు వా ర్డుల్లో ఉన్న ఓటర్లలో పదిశాతం పెం చడం లేదంటే తగ్గించడం అనవా యితీగా రావడం పదిశాతం ఓటర్ల తో కలిపి కొత్త వార్డులు ఏర్పాటు చే య డం కూడా చకచక జరిగిపోయాయి.

నల్లగొండకు ఇక మేయర్….

నల్లగొండ మున్సిపాలిటీ 1941లో ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చ ట్టం ప్రకారం ఆ తర్వాత 1955లో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ జాబి తాలో చేరింది. రాష్ట్ర రాజధాని హైదరాబా ద్ కు సమీపoలో 100 కిమీ దూరం లో ఉన్న నల్లగొండ పట్టణం జాతీ య, రాష్ట్ర రహదా రుల సమాహారం గా కొనసాగుతోంది.

నల్లగొండ కు మహర్దశ... నల్ల గొండ మున్సిపాలిటీ కార్పోరేషన్ స్థా యికి అప్ గ్రేడ్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీ ఎ త్తున సమకూరుతాయి. భూముల ధరలు పెరుగుతాయి, ఇంటి అద్దె లు, మున్సిపల్ ట్యాక్స్ ధరలు పెరు గడంతో పాటు నల్లగొండ జిల్లా కేం ద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఎస్ఏ పె రుగుతుంది. సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ పెరుగు తుంది. విశాలమైన రో డ్ల నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి కే బైపా స్ రోడ్డు నిర్మాణం, లతీఫ్ సాహెబ్ గుట్టమీదకు ఘాట్ రోడ్డు నిర్మా ణం తో పట్టణ రూపురేఖలు మారిపోతుండగా, కార్పోరేషన్ స్థా యి కి పెరిగితే పట్టణంలో మరిన్ని మౌలికవసతులతో మహర్దశ పట్ట నుంది.