Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tourism Conclave Shilparamam : బిగ్ బ్రేకింగ్, రేపే శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్‌, ఆహ్లాదం, ఆరో గ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలకు అవకాశం

--అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణా ల‌తో హోట‌ళ్లు --సంప్ర‌దాయ వంట‌కాల‌కు ప్ర‌ పం చ‌వ్యాప్త ప్ర‌చారం --హెలీ టూరిజం, టూరిజం పోలీస్ వ్య‌వ‌స్థ ప్రారంభం --ఫిల్మ్‌, మెడిక‌ల్ టూరిజం పోర్ట‌ళ్ల ప్రారంభం --బ‌హుముఖ అవ‌కాశాల‌కు మా ర్గంగా ప‌ర్యాట‌క రంగం --రేపు శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్‌ కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

 

Tourism Conclave Shilparamam : ప్రజా దీవెన, హైద‌ రాబాద్‌: న‌చ్చిన అడ‌వి… మెచ్చిన వంట‌… దుమికే జ‌ల‌పాతం.. హెలీకాఫ్ట‌ర్ విహారం… డ‌బుల్ డెక్క‌ర్ ప‌డ‌వ ప్ర‌యాణం… అడ‌వి జంతువుల సంద‌ర్శ‌న… ప‌ర్యాట‌కం అంటే అంతేనా అంటే ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు అంతే… కా నీ ఇప్పుడు ఆ ఆర్ధం మ‌రింత విస్తృ త‌మ‌వుతోంది. న‌చ్చిన అడ‌వి ద‌గ్గ‌రే రాత్రి వేళ బ‌స చేసే అవ‌కాశం.. నిశి రాత్రి వేళ అడ‌వి జంతువులను చూ డ‌డం… మ‌న సంప్ర‌దాయ వంట‌ ల‌ను ప్ర‌తి ఒక్క‌రికి ప‌రిచ‌యం చే య‌డం.. మ‌నం అందించే వైద్య సేవ‌లను ప్ర‌పంచానికి తెలియ‌ జేయ‌డం.. వాటి కోసం వ‌చ్చే వారికి అ న్ని వ‌స‌తులు క‌ల్పించ‌డం.. వారి సందేహాలు నివృత్తి చేయ‌డం.. సం ద‌ర్శ‌న‌ కోసం మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప‌ ర్యాట‌కులకు స‌క‌ల వ‌స‌తులు క‌ ల్పించి వారికి మ‌రిచిపోలేని మ‌ధు రానుభూతి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ వ‌డివ‌డిగా అ డుగు లు వేస్తోంది. ఇందులో భా గంగా అనేక నూత‌న ప్రాజెక్టుల‌కు శ్రీ‌కా రం చుడుతోంది…ప్ర‌పంచ ప‌ ర్యాట‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌ రించుకొ ని హైద‌రాబాద్ శిల్పా రామం వేదిక‌గా శ‌నివారం నిర్వ‌ హించే తెలం గాణ టూరిజం కాం క్లేవ్‌-2025లో వాటిని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆవిష్క‌ రించ‌నుంది.ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, రాష్ట్ర ప‌ర్యాట‌కాభి వృద్ధి సంస్థ ఛైర్మ‌న్ ప‌టేల్ ర‌మేశ్ రె డ్డి ఇందులో పాల్గొన‌నున్నారు. కాంక్లేవ్‌లో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆ ధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న ప‌లు కార్య‌ క్ర‌మాల‌ను ప్రారంభించ‌ నున్నా రు.

*15 వేల కోట్ల పెట్టుబ‌డులు, 50 వేల ఉద్యోగాలు….* ప‌ర్యాట‌క రం గాన్ని కేవ‌లం ఆహ్లాదానికే ప‌రిమితం చేయ‌కుండా దాని నుంచి పెట్టుబ‌ డులు ఆక‌ర్షించ‌డం, పెద్ద సంఖ్య‌లో యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్ట‌కుంది. అందులో భా గంగా ప్ర‌భుత్వ‌- ప్రైవేటు భాగ‌స్వామ్యం (ppp), పూర్తిగా ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆహ్వానిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం టూరిజం పాల‌సీని అధ్య‌య‌నం చేసిన ప‌లువురు పె ట్టుబ‌డిదా రులు రాష్ట్రంలో అంత‌ర్జా తీయ స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన హోట‌ ళ్లు, వెల్‌నెస్ సెంట‌ర్లు, హాస్పి టాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సు ముఖ‌త వ్య‌క్తం చేశారు. ఇందులో అనంత‌గిరి కొండ‌ల్లో జెసోమ్ అం డ్ జెన్ మేఘా సంస్థ సంయుక్త భాగ‌ స్వామ్యంతో అత్యాధునిక వెల్‌ నెస్ సెంట‌ర్, ద్రాక్ష పంట నుంచి వైన్ త‌ యారీ యూనిట్‌, అట‌వీ ప్రాంతంలో తాజ్ స‌ఫారీ, మ‌హేంద్ర కంపెనీ ఆ ధ్వ‌ర్యంలో వాట‌ర్‌ ఫ్రంట్ రిసార్ట్స్‌, ఫై వ్ స్టార్ హోట‌ల్స్‌, తెలంగాణ‌లో టై ర్ 2 న‌గ‌రాల్లో జింజ‌ర్ హోటళ్లు, నా గార్జున సాగ‌ర్‌లో వెల్‌నెస్ రిట్రీట్‌.. వెడ్డింగ్ డెస్టినేష‌న్ సెంట బుద్ధ‌వ‌నా న్ని మ‌రింత ఆకర్ష‌నీయంగా తీర్చి ది ద్దేందుకు తైవాన్‌కు చెందిన Foguang shan సిద్దంగా ఉంది. ముఖ్య‌ మంత్రిఎ.రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో నే డు ఈ సంస్థ‌లు ఆయా ప‌నుల‌కు సం mబంధించి ఒప్పందాలు చేసు కోనున్నాయి. ఫ‌లి తంగా రూ.15 వేల కోట్లు పెట్టుబ‌డులు తెలంగాణ‌ కు రావ‌డంతో పాటు ప్ర‌త్య‌క్షంగా, ప‌ రోక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంది.

*అంత‌ర్జాతీయ చిత్రన‌గ‌రిగా....* ప్ర‌పంచ స్థాయి చిత్రాల ని ర్మాణ కేంద్రంగా ఇప్ప‌టికే హైద‌రాబా ద్‌కు మంచి పేరు ఉంది.. దానిని మ‌రింగా అభివృద్ధి ప్ర‌పంచ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌రింత స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణం క‌ల్పించి అత్య‌ధిక చిత్రాలు హైద‌రాబాద్‌లోనే నిర్మించే లా చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సం క‌ల్పించింది. ఇందులో భాగంగా శ‌ని వారం రోజు ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నుంది. ఈ పోర్ట‌ల్ ద్వారా సినిమా నిర్మాణాల‌ కు సంబంధించి సింగిల్ విండో అను మ‌తులు ఇవ్వ‌డంతో పాటు ఏఐ ద్వారా వివిధ లోకేష‌ న్ల‌లో షూటింగ్‌ ల‌కు త‌క్ష‌ణ అనుమ‌తి ల‌భించ‌నుం ది. ఈ సులు వైన విధానాల‌తో జాతీ య‌, అంత‌ర్జాతీయ‌ చిత్ర నిర్మాణాల‌కు హైద‌ రాబాద్ నిల‌యంగా మార‌నుంది..

*ఆరోగ్య న‌గ‌రం….* చౌక ధ‌ర‌ల్లో నే మెరుగైన వైద్య స‌దుపాయం అం దుబాటులో ఉండ‌డంతో ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి ఇప్ప‌ టికే పెద్ద సంఖ్య‌లో హైద‌రాబాద్ ఆసుప‌త్రుల‌కు వస్తున్నారు.. వారి ని మ‌రింత పెద్ద సంఖ్య‌లో ఆక‌ర్షించేందుకు తెలంగాణ మెడిక‌ల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్ట‌ల్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం శ‌నివా రం ప్రారంభించ‌నుంది. ఈ పోర్ట‌ల్‌లో హైద‌రాబాద్‌లో ఏ ఏ ఆసుప్ర‌ తులు ఉన్నాయి. ప్ర‌ముఖ వైద్యులెవ‌రు.. వారు ఏర‌క‌మైన సే వ‌లు అందిస్తారు… ఏ బీమా సౌ క‌ర్యం అందుబాటులో ఉంది.. వీసా ల జారీ.. పొడిగింపు త‌దిత‌ర వివ‌ రాలుంటాయి. విమానా శ్ర‌యం నుంచి ఆ ఆసుప‌త్రికి ఎలా చేరుకోవాల‌నే వివ‌రాలుంటాయి. అలాగే ఆయా దేశాల నుంచి వ‌చ్చే వారి సౌ ల‌భ్యం కోసం వారి భాష‌ను అనువ‌దించే ట్రాన్స్‌లేట‌ర్ల వివ‌రాలు ఉంటాయి. ఫ‌లితంగా పెద్ద సంఖ్య‌లో హె ల్త్ టూరిజం అభివృద్ధి చెంద‌డంతో పాటు ఉపా ధి అవ‌కాశాలు మెరుగు ప‌డ‌నున్నాయి.

*హెలీకాఫ్ట‌ర్ విహారం….* రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు హెలీకాఫ్ట‌ర్ టూ రిజం లేదు, పెరిగిన జీవ‌న ప్ర‌మా ణాలు, స‌మ‌యాన్ని స‌ద్వి నియోగం చేసుకోవ‌డంతో పాటు ప‌ర్యాట‌కు లు స‌రికొత్త అనుభూతి చెందేందు కు హెలీకాఫ్ట‌ర్ టూరిజాన్ని రాష్ట్ర ప్ర‌ భుత్వం ప్ర‌వేశ‌పెడు తోంది.. తొలుత హైద‌రాబాద్ నుంచి సోమ‌శిల అక్క‌డి నుంచి శ్రీశై లం వ‌ర‌కు హెలీకా ఫ్ట‌ర్ సేవ‌లు ప్రారంభిస్తారు. ప‌ర్యాట‌ కుల ఆద‌ర‌ ణ ఆధారంగా దానిని మ‌ రింత‌గా విస్త‌రిస్తారు. సీప్లేన్ అను మ‌తు ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ యత్నిస్తోంది. నాగార్జున సాగ‌ర్ నుంచి శ్రీ‌శైలం, శ్రీ‌శైలం నుంచి భ‌ద్రా చ‌లం వ‌ర‌కు సీప్లేన్ విహారం ఉండ‌ నుంది. నీటి మీద మాత్ర‌మే లాంఛ‌ య్యే సీ ప్లేన్‌ల‌ను రాష్ట్రంలో అందు బాటులోకి తీసుకురావాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిం చింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై (ఫీ జుబిలిటీ) అధ్య‌య‌నం సాగుతోంది.

*మ‌న వంటరుచులు….* తెలంగాణ‌లో వంట‌ల వైవిధ్యం ఎంత‌గా నో ఉంది.. హైద‌రాబాద్ బిర్యాని ప్ర‌ పంచ ప్ర‌సిద్ధం.. అలాగే మ‌న స‌ర్వ‌ పిండి.. స‌కినాలు… బోటి కూర‌… ప్ర‌ తి జిల్లాల్లో ప్ర‌త్యేకమైన వంట‌కాల‌ ను ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌చారం చే యాల‌ని రాష్ట్ర ప్ర‌భు త్వం సంక‌ల్పించింది. ఏ ప్రాంతంలో ఏ వంట‌.. ఆ వంట ప్ర‌త్యేక‌ త‌ల‌తో కూడిన మ్యాప్ త‌యారు చేసింది. ఈ వం ట‌కాల‌ను ప్ర‌పం చానికి ప‌రిచ‌యం చేసేందుకు నెద‌ర్లాండ్స్ ప్ర‌భు త్వం తో మ‌న ప్ర‌భుత్వం ఒప్పందాలు చే సుకోనుంది. ఈ ఒప్పందాలతో మ‌ నం వంట‌ల‌కు అంత‌ర్జాతీయంగా గిరాకీ పెర‌గ‌డంతో పాటు స్థానిక ఉ పాధి అవ‌కాశాలు పెర‌గ‌నున్నాయి.

*ప‌ర్యాట‌కుల‌కు భ‌ద్ర‌త‌…*తెలంగాణ‌ను సంద‌ర్శించే ప్ర‌తి ప‌ర్యాట‌ కునికి సరైన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించు కుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగా ణ‌లో కేవ‌లం 15 మంది టూరిస్ట్ పో లీసులే ఉండ‌గా ఆ సంఖ్య‌ను 90కు పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇటీవ‌ల కాలంలో ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి మ‌హిళ‌లు ఒంట‌రిగానే ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వ‌స్తున్నారు.. వారికి భ‌ద్ర‌త‌, భ‌రోసా క‌ల్పించే లా ఈ టూరిస్ట్ పోలీసులు సేవ‌లు అందించ‌నున్నారు.

*ప్ర‌యాణం,వ‌స‌తి….* తెలంగా ణ‌లోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వెళ్లే వారు రైళ్లు, బ‌స్సులు, అవ‌స‌ర‌మైన వాహ‌నాల్లో సాఫీగా ప్ర‌యాణం చే సేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ, ఇత‌ ర ట్రావెలింగ్ సంస్థ‌ల‌తో టూరిజం శాఖ ఒప్పందం చేసుకుంటోంది. వీ టితో ప‌ర్యాట‌కులు కోరుకునే వా హ‌నాలను అందుబాటులో ఉంటా యి..ప‌ర్యాట‌కుల సంఖ్య ఆధారం గా భారీ వాహ‌నాలు క్యార‌వాన్‌లు అందుబాటులో ఉంచుతా రు. అ లాగే డిజిట‌ల్ టూరిజం కార్డ్‌ను అం దుబాటులో ఉంచ‌నున్నారు. ఈ కా ర్డును రీఛార్జ్ చేసుకుంటే వివిధ ఆల‌ యాలు, ర‌వాణా వాహ‌నాలు, హో ట‌ళ్ల‌లో రాయితీలు ల‌భిస్తాయి. ఒకే కార్డు ప‌లు చోట్లు ఉప‌యోగ‌ప‌డ‌ డంతో ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ఉప‌శ‌ మ‌నంగా ఉంటుంది.

*భారీ కార్య‌క్ర‌మాలు, అవార్డులు...* తెలంగాణ‌లో భారీ కార్య‌క్ర‌ మాల నిర్వ‌హ‌ణ‌కు వీలుగా బుక్ మై షోతో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది.. ఈ ఒప్పందంతో భారీ సినిమా ఈ వెం ట్లు, ఎగ్జిబిష‌న్లు, ఇత‌ర కార్య‌క్ర‌మా లు నిర్వ‌హించే వీలుం టుం. ది. ప‌ర్యా ట‌క రంగంలోని హోట‌ళ్లు, ఇత‌ర సం స్థ‌లు అందించే సే వ‌ల ఆధారంగా వాటికి రాష్ట్ర ప్ర‌భుత్వం అవార్డులు ప్ర‌దానం చేయ‌ నుంది. జ‌ల విహారా ల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం హుస్సేన్ సాగ‌ర్‌లో 120 సీట్ల సామ‌ర్థ్య‌మున్న డ‌బుల్ డెక్క‌ర్ బోట్‌ ను శ‌నివారం రాష్ట్ర ప్ర‌ భుత్వం ప్రారంభించ‌నుంది. హైద‌రా బాద్‌కు ఒక నాడు జీవ‌నాడిగా ఉన్న మూసీ అస‌లు పేరైన ముచుకుందా పేరు ను ఈ బోట్‌కు పెట్టారు.