Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 8:27 am Posted by : praja deveena

Road Accident in Nalgonda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఘోర రోడ్డుప్రమాదం, ఇరువురి దుర్మరణం 

Road Accident in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఘోర రోడ్డుప్ర మాదం చోటుచేసు కుంది. నల్లగొండ మండలం చంద నపల్లి గ్రామ సమీపంలో సంభవిం చిన ఘోర రోడ్డు ప్రమాదంలో బావా బామర్దులు దుర్మరణం పాలయ్యారు. స్కూల్ బస్సు ఢీకొనడం తో బైక్‌పై వెళ్తున్న వీరిద్దరు సంఘటనా స్థలంలో అక్కడికక్కడే ప్రాణాలొదిరారు.

సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉ దయం నిశ్శబ్దంగా ప్రారంభమైన రోజు పొద్దుపొద్దునే క్షణా ల్లోనే విషాదంగా మారిపోయింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసం ద్రంలో ముంచేసింది. చందనపల్లి గ్రామ సమీపంలో బైక్‌పై ప్ర యాణిస్తున్న బావా, బామ్మర్దులు విషాదాంతానికి గుర య్యారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నల్లగొండ నుంచి నకిరేకల్ వై పు వెళ్తున్న వారి బైక్‌ను ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం అంత తీవ్రంగా ఉండటంతో ఇద్ద రూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు సం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి మృతులను వంశీ (30), రమేష్ (30)గా గుర్తించారు.

వీరిలో వంశీ నక్కలపల్లి గ్రామానికి చెందినవాడు కాగా, రమే ష్ ఊ ట్కూరు గ్రామ నివాసి అని తెలిపారు. కుటుంబ అవ సరాల కోసం బయలుదేరిన ఈ ప్రయాణం వారి జీవితాల్లో చివరి ప్రయాణంగా మారింది.ప్రమాద సమాచారం అందు కున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు.

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసు పత్రి కు తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెల కొంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎంత పెద్ద వి షాదానికి దారితీ స్తుందో ఈ ప్రమాదం మరోసారి గుర్తు చే సిందని అక్కడి వారంతా చర్చించుకుంటూ ఉసూరుమన్నా రు.