Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 3:36 pm Posted by : praja deveena

Bigbreking collectorilatripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ ఇలాత్రిపాఠి కీలక ప్రకటన, చినకాపర్తి విషయం పెద్దదేమి కాదు

 

Bigbreking collectorilatripathi:  ప్రజా దీవెన, నల్లగొం డ: నల్లగొండ జి ల్లా చిట్యాల మండలం, చినకాపర్తి లో మొదటి విడత గ్రామ పంచాయ తీ ఎన్నికలలో పోలైన ఓట్లు డ్రైనేజీ లో బయటపడిన సంఘటనలో ఎ లాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి ఇలా త్రిపాఠి స్ప ష్టం చేశారు. శుక్రవారం రాత్రి 6,7 గంట ల మధ్య చినకాపర్తిలో పో లైన బ్యా లెట్ పేపర్లు డ్రైనేజీలో బయటప డ్డాయని సమాచారం అందిన వెంట నే నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిని వెంటనే అక్కడికి పం పించడం జరిగింద ని, ఎంపీడీవో, ఆర్వో , ఇతర సిబ్బంది అందరి సమక్షంలో ఆర్డిఓ విచార ణ నిర్వ హించారని,విచారణ అనంతరం పోలైన ఓట్లకు, కౌంటింగ్ కు సరిపోయాయని తెలిపారు.

పోలింగ్,కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి న తర్వాత, గెలిచిన అభ్యర్థిని ప్రక టించిన అనంతరం, కౌంటింగ్ ఏజెం ట్ల సమక్షంలో వారి సంత కం తీసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్లు సరిపోల్చుకున్న తర్వాత గెలిచిన, ఓడి న అభ్యర్థుల సంతకాలు కూడా తీసుకున్న అనంత రం ఆర్ ఓ సంబంధిత గది నుండి బయటికి వెళ్లిపోయారని, అనం తరం ఇలాంటి సం ఘటన జరిగిందని కలెక్టర్ తెలిపారు.

నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రా ల అకౌంట్ మ్యాచ్ అయిన త ర్వాత గన్ని బ్యాగ్ లో సీల్ చేయాల్సి ఉం డగా, స్టేజ్ -2 ఆర్వో వాటి ని వదిలి బయటకు వెళ్లడం, కింది స్థాయి అధికారులు వాటిని వది లి వేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్న మైందని తెలిపారు.చిన కాపర్తి గ్రా మ పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో పోల్ అయిన ఓట్ల కు,బ్యాలెట్ బాక్సులో ఉన్న ఓట్లు,డ్రైనేజీలో దొ రికిన ఓట్లకు ట్యాలీ అయ్యింద ని ,ఎక్కడ బోగస్ ఓటింగ్ గాని, రి గ్గింగ్ గాని జరగలే దని ఆమె స్పష్టం చేశారు.

పోలింగ్ ,కౌంటింగ్ ప్రక్రియ లో ఎక్కడ లోపాలు లేవని, విచారణ త ర్వాత ఆర్ డి ఓ సమక్షంలో దొ రికిన బ్యాలెట్ పేపర్లు కూడా స్ట్రాం గ్ రూంలో భద్రపరచినట్లు కలెక్టర్ వెల్లడించారు.అయినప్పటికీ ఇం దుకు బాధ్యులై న ఆర్వో పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడమే కాకుం డా, విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని, అ లాగే పోలింగ్ బృందాన్ని కూడా సస్పెండ్ చేసి నట్లు ఆమె వెల్లడించారు.