Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bird flu: మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం

కేరళలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని ఆళ్లపులలో రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపె ట్టారు అక్కడి అధికారులు. కేరళలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తితో అప్రమత్తమైంది తమిళనాడు ప్రభుత్వం.

సదరు పౌల్ట్రీ వాహనాలపై నిషేదా జ్ఞలు
మనుషులు భయపడొద్దoటున్న వైద్యులు

ప్రజా దీవెన, కేరళ: కేరళలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని ఆళ్లపులలో రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపె ట్టారు అక్కడి అధికారులు. కేరళలో బర్డ్‌ఫ్లూ(Bird flu) వ్యాప్తితో అప్రమత్తమైంది తమిళనాడు ప్రభుత్వం. కేరళ నుంచి వస్తున్న వాహనాలపై నిషేధం విధించింది. కేరళలోని ఆళ్లపుల జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తిం చారు. రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్న బాతుల నమూ నాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌ లోని ల్యాబ్‌కు పంపగా వ్యాధి నిర్ధారణ అయింది.

శాంపిల్స్‌లో(avian influenza) ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1) ఉందని నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లోని రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చి పెట్టారు. కేరళలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందడంతో అలెర్ట్ అయింది తమిళనాడు ప్రభుత్వం. కేరళ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచింది. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేప ట్టారు అధికారులు. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాపించకుండా కేరళ నుంచి వస్తు న్న పౌల్ట్రీ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు.

సరిహద్దులోని చెక్‌పోస్ట్‌లలో(Veterinary Doctor) వెటర్నరీ డాక్టర్‌తో పాటు మెడికల్‌ సిబ్బందిని అందు బాటులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తు న్నారు అధికారులు. తమిళనాడు రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి వాహనా న్ని శానిటైజ్ చేసి అనుమతిస్తున్నా రు. మరోవైపు ఈ వ్యాధి మనుషుల కు సోకే అవకాశం లేదని చెబుతు న్నారు అధికారులు. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికార యంత్రాం గం స్పష్టం చేసింది. అయితే ప్రజలు సగం ఉడికించిన లేదా పచ్చి గుడ్ల ను తినకూడదని, పూర్తిగా ఉడికిం చిన గుడ్లు, చికెన్ మాత్రమే తినొచ్చని చెబుతున్నారు.

Bird flu spread in Kerala