Bjp: బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి
--బిజెపి జిల్లా అధ్యక్షుడి బాధ్యతల స్వీకారోత్సవంలో నాగం వర్శిత్ రెడ్డి
బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి
–బిజెపి జిల్లా అధ్యక్షుడి బాధ్యతల స్వీకారోత్సవంలో నాగం వర్శిత్ రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: భారతీయ జనతా పార్టీ ( bjp) జెండా ఎగరవేయ డమే ముఖ్య లక్ష్యంగా పని చేస్తానని, కార్యకర్తల అందరని మమేకం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ( The new president is Nagam Varshit Reddy) ఉద్ఘాటించారు. నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయం లో నూతన అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సందర్బంగా నాగం వర్షిత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
పార్టీ అధిష్టానం నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి బాధ్యత ను అప్పగించిo దని పేర్కోన్నారు. జిల్లా అధ్యక్షునిగా నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులకు పేరు పేరునా ధన్యవా దాలు తెలియ చేశారు. మేరా బూత్ సబ్సే మజ్బుత్ అనే నినాదంతో ( With the slogan Mera Booth Sabse Majbooth) బూతు స్థాయి లో పార్టీని బలోపేతం చేస్తు పార్టీని ముందు కొనసా గించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
పార్టీలో బూతు స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరి సహా య, సహకారాలు ఎల్లవేళలా అందిపుచ్చుకునేo దుకు పరస్ప ర సహకారం తీసుకుంటా నని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ఎల్లవేళలా కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటనని తెలియజేశా రు.
అంతకు ముందు నూత న అధ్యక్ష పదవి భాధ్యత చేపట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున నాయ కులు, కార్యకర్తలు డాక్టర్ నాగం వర్శిత్ రెడ్డిని ఘనంగా సన్మానించా రు. అదే సందర్భంలో బిజెపి జిల్లా కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి ( Deen Dayal to Upadhyaya statue) పూల మాల వేసి కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీదర్ రెడ్డి చేతుల మీదుగా నాగం వర్షిత్ రెడ్డి నూతన అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ఇంచార్జ్ ప్రదీప్ కుమార్, నాయకులు గోలి మధుసూ దన్ రెడ్డి, మాధగోని శ్రీనివాస్ గౌడ్, నూకల నరసింహా రెడ్డి, బండారు ప్రసాద్, నూకల నారాయణరెడ్డి, పోతేపాక సాంబ య్య, ఫకీర్ మోహన్ రెడ్డి, పెరిక ముని కుమార్, పాలకూరి రవి గౌడ్, ముడుసు బిక్షపతి, కోడేటి శ్రీను, పోతేం కరుణాకర్, కేతావత్ భాస్కర్ నాయక్, జటావత్ గణేష్ నాయక్, విహారి కుమార్, బోగరి అనిల్ కుమార్, కొత్తపల్లి ప్రమోద్, గడ్డం మహేష్, విధ మోర్చల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.